VeeraSimha: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి విడుదలైన మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.. ఇక బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. బాలకృష్ణ కెరీర్ చూస్తే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిగర్స్ చూపించింది.. అంతేకాకుండా యూఎస్ ప్రీమియర్స్ లో కూడా అరుదైన రికార్డును క్రియేట్ చేసినట్లు సమాచారం…
వీర సింహా రెడ్డి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. షేర్ చూస్తే… 30 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్ సీస్ లో కేవలం ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్స్ ద్వారానే ఒక మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాబట్టాడు వీర సింహారెడ్డి. విదేశాల్లో ప్రీమియర్స్‌ను నందమూరి అభిమానులు విజయవంతం చేశారు. ఇది బాలకృష్ణ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డుగా చెబుతున్నారు ట్రేడ్ వర్గాలుు.. మొత్తానికి బాలయ్య బాబు ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే దుమ్ము దులిపేసాడు ఇక ముందు ముందు ఎన్ని వండర్ క్రియేట్ చేస్తాడో చూడాలి.