Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీరసింహ రెడ్డి.. ఈ సినిమా మొదటి రోజే భీభత్సమైన కలెక్షన్స్ వసూలు చేశాయి.. ఇక రెండో రోజు తగ్గినా.. ఆ తరువాత నుంచి కలెక్షన్స్ పుంజుకున్నాయి.. రెండు వారాలు బాలయ్య ఊరమాస్ కలెక్షన్స్ వసూలు చేశారు.. బాలయ్య సినిమాకి ఎన్ని కోట్లు లాభాలు వచ్చాయి.. ఈ సినిమా కలెక్షన్స్ తో తన రికార్డ్ ను తనే బీట్ చేశారు.. ఆ వివరాలు చూద్దాం..

వీర సింహా రెడ్డికి నైజాంలో రూ.15 కోట్లు, సీడెడ్‌లో రూ.13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అదేవిదంగా కర్నాకటలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా 14వ రోజు దీనికి రూ. 8 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.
వీర సింహ రెడ్డి సినిమాకి రెండు వారాల్లో భారీగా కలెక్షన్స్ వసూలు చేసింది. నైజాంలో రూ. 16.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.14 కోట్లు, గుంటూరులో రూ. 6.30 కోట్లు, కృష్ణాలో రూ. 4.64 కోట్లు, నెల్లూరులో రూ. 2.93 కోట్లతో కలిపి.. రూ. 64.90 కోట్లు షేర్, రూ. 105.02 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 75.40 కోట్లు షేర్, రూ. 126.80 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి దాదాపు రూ. 75.40 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.40 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.
వీర సింహా రెడ్డి సినిమా టాక్ తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లోనే రూ. 75.40 కోట్లు వచ్చాయి. దాంతో వీర సింహ రెడ్డి సినిమా అఖండ లైఫ్ టైం కలెక్షన్లు రూ. 75.10 కోట్లు దాటేసింది. ఫైనల్ గా బాలయ్య కెరీర్‌లో టాప్ సినిమా వీర సింహ రెడ్డి రికార్డు సృష్టించింది.