Breaking: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి.. ఈ సినిమా ధియేటర్స్ లో విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేస్తోంది.. అంతేకాదు మొదటి రోజే ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్లు వసూలు చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద అంతకుముందు రికార్డ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్లను కూడా కొల్లగొడుతూ బాలయ్య తనదైన సత్తలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.. అయితే కొంతమంది కావాలని బాలయ్య సినిమా చూడమని టిడిపి నాయకులను బలవంతం చేస్తున్నారని.. ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ పై బాలయ్య ఫ్యాన్స్ కూడా గట్టిగానే స్పందిస్తున్నారు..

ప్రతి రోజు 200 మందికి వీర సింహ రెడ్డి సినిమా ఉచితంగా చూపించాలని.. నియోజకవర్గం లోని ఏదో ఒక థియేటర్లో మినిమం 50 రోజులు సినిమాని ఆడించాలని.. టిడిపి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ప్రతి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.. అని ఓ ఫేక్ మెసేజ్ క్రియేట్.. దానిని వైరల్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.. అయితే ఇది ఫేక్ న్యూస్.. అలాగే ఫేక్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తున్నారు..

ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ వేశారు. అయితే ఇది నచ్చని గిట్టని కొంతమంది కావాలని టిడిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ యాంటీగా ఉన్న వారంతా ఇలాంటి మెసేజ్లను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ సినిమాలను చూసి గెలిపిస్తారు. ఇలా బలవంతంగా థియేటర్లకు రప్పించి జనాల చేత తన సినిమాలను చూపించుకోవాల్సిన అవసరం లేదు అని బాలయ్య ఫ్యాన్స్ వాదన. బాలకృష్ణ ఎప్పుడు తన ఫాన్స్ ని గాని తన నియోజకవర్గాన్ని కానీ ఏనాడు తన సినిమా చూడమని బలవంతం చేయలేదు.
అలాంటిది ఇలాంటి మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అయితే మేము ఎందుకు ఒప్పుకుంటాం అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఫేక్ మెసేజ్ ని నమ్మద్దు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా అది ఫేక్ న్యూస్ అంటూ స్ప్రెడ్ చేస్తున్నారు. మా హీరో పై ఇలాంటి రూమర్స్ మరోసారి స్ప్రెడ్ చేస్తే ఈసారి గట్టిగా సమాధానం చెబుతాం అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్..