Balakrishna: వీరసింహా రెడ్డి బాలేదు అని ఫీల్ అవుతోన్న బాలయ్య ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి ! 

Balakrishna: నందమూరి నరసింహ బాలకృష్ణ గోపీచంద్ మరిన్ని దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం వీర సింహారెడ్డి.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.. దాంతో బాలకృష్ణ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్నారు.. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే.. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..

Balakrishna 108 movie Anil ravipudi intresting update
Balakrishna 108 movie Anil ravipudi intresting update

ఎన్.బి.కె 108 గా వస్తున్న ఈ కాంబో సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. అనీల్ మార్క్ ఎంటర్టైన్ మెంట్ మూవీగా తీస్తూనే బాలయ్య మార్క్ మాస్ అంశాల మీద ఫోకస్ పెట్టారు అనిల్.. ఈ చిత్రంలో ప్రియాంకా జవల్కర్, శ్రీ లీల లాంటి భామలు నటించనున్నారు.

 

 

వీర సింహా రెడ్డి సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో కొంతమందికి నచ్చకోవచ్చు.. అయితే అనీల్ రావిపుడి కాంబినేషన్ లో రానున్న సినిమా మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. బాలయ్యలోని కామెడీ యాంగిల్ ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమా కథ విన్నప్పుడే బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు టాక్. ఎలాగు వీర సింహా రెడ్డి హిట్టు కాబట్టి ఆ జోష్ తో ఈ 108వ సినిమా కూడా అదే హిట్ మేనియా కొనసాగించేలా చూస్తున్నారు.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ వరుస హిట్లర్ దూసుకెళ్తున్న బాలయ్య కాంబినేషన్లో రానున్న ఈ కామెడీ యాక్షన్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించేటట్టు తీస్తానని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . బాలయ్య లోని కామెడీ యాంగిల్ ను మీ అందరికీ పరిచయం చేస్తూ కడుపుబ్బ నవ్వించడం ఖాయమని అనిల్ రావిపూడి అన్నారు..