Babu Gogineni: రాజకీయాల పై సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై బాబు గోగినేని క్లారిటీ ఇచ్చారు.. ఫేస్ బుక్, ట్విట్టర్ లో రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలవడం పై వస్తున్న అపోహలపై.. బాబు గోగినేని సోషల్ మీడియా వేదికగా స్పందించారు..!! తాను ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదంటూ స్పష్టం చేశారు..!బాబు గోగినేని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాబు గోగినేని జనసేనకు సపోర్ట్ చేస్తున్నారని వాట్సాప్, ఫేస్ బుక్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. వీటిని బాబు గోగినేని ఖండించారు.
తను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం లేదని.. నేడు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు బాబు గోగినేని. తను పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ వాట్సాప్, ఫేస్ బుక్ లో చాలా కాపీలు సర్కులేట్ అవుతున్నాయి. ఇది సరికాదని.. ఓటర్లు తమ నిర్ణయానికి రావాలి కానీ.. పవన్ కళ్యాణ్ తన రాజకీయాల ప్రచారం కోసం తన పేరు సరి కాదని బాబు గోగినేని తెలిపారు.నాకు రాజకీయాల గురించి తెలిసిన.. జనసేన అధినేత, తన అభిరుచులు వేరుగా ఉంటాయని.. హేతువాదం పై వ్యవస్థీకృత రాజకీయాలకోసం తాను నిలబడతానని అన్నారు.
లౌకికవాదం, మానవ హక్కులు, సామాజిక సంస్కరణ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం తన నినాదమని ఆయన తెలిపారు. యువతకు మంచి ఉద్యోగాలు అందించాలని, అవినీతి నిర్మూలన కావాలని, ఆరోగ్యం కోసం చక్కటి బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. నేను రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాను కానీ.. రాజకీయా సామాజిక జీవితంలో ఈ ముఖ్యమైన సూత్రాలను పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా అన్నది ప్రశ్నగా ఉందన్నారు. జనసేన పార్టీ అధికారిక ఫేస్బుక్ లో తనపై చేసే ప్రచారాన్ని ఆపాలని బాబు గోగినేని సూచించారు.