Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యి.. జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకుంది.. సినిమాలలో నటించిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకుంది.. అషు రెడ్డి సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటుంది..

జూనియర్ సమంతగా వీడియోలతో నెట్టింట వైరల్ అయిన ఈ బ్యూటీ.. బిగ్బాస్ తో క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల బిగ్ బాస్ జోడి లో డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేసింది కానీ అనుహంగా ఆ షో నుంచి తప్పుకుంది.. తన వ్యక్తిగత కారణాలవల్ల ఏవో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆషు సోషల్ మీడియాలో ఆ విషయాన్ని స్వయంగా తెలిపింది..
తాజాగా అషు రెడ్డితన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది.. ఈ వీడియోలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యామీనన్ చెప్పిన డైలాగ్.. అషు రెడ్డి రీల్ చేసింది. పెళ్లి చేస్తారండి. చేస్తే నీతో ఉండిపోతానా.. కాఫీలో విషం వేసి పెళ్లయిన వారమే చంపేస్తాను.. కొన్ని దినాలు ఏడుస్తాను. క్యూట్ గా ఉంటాను కదా.. మా అన్న కరిగిపోయి ఏం కావాలో కోరుకోమంటాడు.. అంటూ చేసిన వీడియో వైరల్ గా మారింది.
కాగా ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇలా భర్తకు నువ్వు విషం పెట్టి చంపేసే రకమే.. నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు కానీ.. వాడి పని గోవిందా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యమీనన్ ఎంత క్యూట్ గా ఈ డైలాగ్ చెప్పిందో.. నువ్వు మాత్రం ఎంత వైలెంట్ గా చెప్పావు అషు అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.