Hair Tips : ఇక మనం ప్రతిరోజు ఆఫీసులకు, కాలేజీలకు, స్కూల్స్ కు అంటూ ఇతర కార్యక్రమాల మీద బయటకు వెళ్ళక తప్పదు అలా బయటకు వెళ్లినప్పుడు సూర్యరశ్మి , వాహనాల నుండి వెలువడే దుమ్ము, ధూళి , కలుషిత పొగలు వంటి కారణాల వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. అలా మారిపోయిన జుట్టుకు తాజా దనాన్ని కోమలాన్ని అందించడంలో నూనె చాలా చక్కగా పనిచేస్తుంది. అందుకే వారంలో రెండు సార్లయినా సరే జుట్టుకు నూనె రాసి తల స్నానం చేయాలి.జుట్టుకు నూనె అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా తాజాగా ఉండడంతో పాటు ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి.
మార్కెట్లో ప్రస్తుతం రక రకాల పోషకాలు నిండిన నూనెలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని మీ జుట్టుకు అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జుట్టుకు నూనె రాయడం వల్ల తలపై ఉండే మృత కణాలు తొలగిపోయి.. శిరోజాలు కూడా మృదువుగా, అందంగా ఉండడంతో పాటు జుట్టు రాలే సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే జుట్టుకు నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని అయితే ఉన్నాయో అదే నూనెను సరిగా రాయక పోతే నష్టాలు కూడా వున్నాయి.ఇకపోతే జుట్టుకు నూనె ఎలా అప్లై చేయాలి అనే విషయం కూడా తప్పకుండా తెలుసుకోవాలి.

లేకపోతే జుట్టుకు అలాగే తలకు కూడా హానీ కలిగించవచ్చు. కొంతమంది జుట్టు మాడుకు ఎక్కువగా నూనెను అప్లై చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫోలిక్యులిటిస్ కు కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జుట్టును ఎక్కువసేపు మసాజ్ చేయడం వల్ల జుట్టు సాంద్రత తగ్గిపోయి జుట్టు రాలడం పెరుగుతుంది. తలస్నానానికి కేవలం రెండు గంటల ముందు మాత్రమే జుట్టుకు నూనె అప్లై చేయాలి. అది కూడా కేవలం మునివేళ్లతో ని మసాజ్ చేయడం తప్పనిసరి. జుట్టుకు నూనె అప్లై చేసే ముందు రెండు నిమిషాలపాటు గోరువెచ్చని ఉష్ణోగ్రత దగ్గర వేడి చేయాలి. ఇక ఇప్పుడు ఈ నూనెను జుట్టుకు పట్టించి వచ్చు.