APPLE:ఆకట్టుకుంటున్న ఫీచర్లతో ఆపిల్ వాచ్ అల్ట్రా లాంఛ్.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాక్.!

యాపిల్ సంస్థ కొంచెం ధర ఎక్కువైనా సరే కస్టమర్లను ఆకర్షించడానికి ప్రత్యేకమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది . స్మార్ట్ఫోన్లను అలాగే వాచ్ లను ఉపయోగించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ క్రమంలోనే యాపిల్ సంస్థ ఒక స్మార్ట్ వాచ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ధరలు అలాగే ఫీచర్స్ ప్రతి ఒక్కటి కూడా కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా యాపిల్ టెక్ ఈవెంట్ ఫార్ అవుట్ ఈవెంట్ ను సెప్టెంబర్ 7వ తేదీన పూర్తి చేసింది.

ఇక ఈ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ తో పాటు మరికొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేసింది. వాటిలో యాపిల్ వాచ్ అల్ట్రా కూడా ఒకటి. ఇది టెక్నో ప్రేమికుల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. ఇక హై ఎండ్ ఫీచర్లతో వచ్చిన దృఢమైన వాచ్ గా ఇది నిలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. యాపిల్ వాచ్ అల్ట్రాను ఏరో స్పేస్ గ్రేడ్ టైటానియంతో తయారు చేశారు. 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చే రెటీనా డిస్ప్లే దీని సొంతం. అంతేకాదు ఇందులో అడ్వాన్స్డ్ టెంపరేచర్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. -4 డిగ్రీ ఫారిన్హీట్ వద్ద గడ్డకట్టే మంచు , 55 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మండే ఎడారి వేడిని కూడా ఇది తట్టుకుంటుంది.

ఇక ఏ పరిస్థితుల్లో అయినా సరే వాయిస్ కాల్స్ లో ఉండే సౌండ్ క్వాలిటీని మెరుగుపరచడానికి యాపిల్ వాచ్ అల్ట్రా లో ఇంటర్నల్ మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి. ఇక అద్భుతమైన సౌండ్ క్లారిటీని మీరు పొందవచ్చు. అలాగే యాంబియంట్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ ను తగ్గించడానికి వాయిస్ ను క్యాప్చర్ చేయడానికి, మైక్రో ఫాన్లను కూడా ఉపయోగించారు. ఒకసారి రీఛార్జ్ చేస్తే 36 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఇక ఆపిల్ వాచ్ అల్ట్రా లో కొత్త యాక్షన్ బటన్ కూడా ఉంది. అల్ట్రా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జిపిఎస్ ని కూడా ఉపయోగించవచ్చు. ఇక దీని ధర విషయానికి వస్తే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా ,జర్మనీ, జపాన్ ,ఇండియా, యూఏఈ, యూకే ,యూఎస్ వంటి దేశాలలో కస్టమర్లు దీనిని ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని వేరియంట్ లను రూ.89,900 కే సొంతం చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అమ్మకానికి రానుంది.