Food Commissioner : ఇలాంటి ఫుడ్ కమీషనర్ లు ఉంటె .. ఆంధ్ర ప్రదేశ్ కి మంచి రోజులు గ్యారెంటీ !

Food Commissioner : ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింత విజయ్ ప్రతాప్ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో ఆటోల ద్వారా ఇస్తున్న రేషన్ బియ్యం సక్రమంగా అందుతుందా లేదా అని ప్రజలను అడగగా.. రేషన్ సక్రమంగా రావడం లేదని.. రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి బియ్యం అడిగితే చేతులో డబ్బులు పెడుతున్నాడు. లేదంటే నూనె ప్యాకెట్లు ఇస్తున్నాడు. కానీ బియ్యం ఇవ్వటం లేదని చెబుతున్నారు. రేషన్ వ్యాన్ వచ్చినప్పుడు అందరికీ బియ్యం అందటం లేదని కొంతమందికి తగ్గుతుందని చెప్పారు. అలాగే అక్కడ బియ్యం తీసుకోకుండా ఒకవేళ డిపో దగ్గరకు వెళ్లి బియ్యం అడిగితే చెబుతున్నారు. కానీ సాయంత్రానికి మాత్రం ఆటోలో బియ్యం బస్తాలు వెళ్తున్నాయని ..అవన్నీ మేము ఫోటోలు వీడియోలు తీసి పెట్టామని అక్కడివారు విజయ్ ప్రతాప్ కి వారి గోడు చెప్పుకున్నారు.

ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి వీళ్లంతా వచ్చారని గతంలో ఎన్నోసార్లు వీళ్ళ నుంచి మాకు రేషన్ రావడంలేదని ప్రశ్నించగా.. ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదని వాళ్ళు చెప్పారు. సంబంధిత అధికారులను ఫుడ్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని వారు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు అని ఆయన చెప్పారు.

అదే విధంగా ఇప్పుడు మీకు ఇచ్చేది పోర్టిఫైడ్ రైసు. ఇవి రైస్ కాదు. వీటిని కెన్నల్స్ అంటారు. ఇవి ఒక 50 కేజీల బస్తాలో 500 గ్రాములు కలుపుతారు. వీటివల్ల బ్యాక్ బోన్ బాగా స్ట్రెంతనవుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు అయితే పిండం బాగా అభివృద్ధి చెందుతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇవి బలవర్ధకమైన ఆహారం. ఇందులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12 , బియ్యం పొడితో తయారుచేసిన పదార్థం ఇది. నానబెడితే కానీ ఇది ప్లాస్టిక్ రైస్ లా కనపడతాయి.

కానీ ఈ బియ్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు జిల్లాలలో ఇస్తుంద. ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా ఒకటి. విశాఖపట్నంలో నేను వీటన్నింటినీ తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చాను అని ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ రైస్ అనుకొని తినకుండా మానేయకండి . ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని వివరించడంతోపాటు మీ సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఇలాంటి ఫుడ్ కమిషనర్ లు ఉంటే .. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు గ్యారెంటీ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..