AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లో జనవరి 18 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ విధించారు.. నిన్నటితో ఈ గడువు ముగియడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..!!ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ ను పొడగించాలని నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరో 14 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. నేటి నుంచి ఇది అమలులోకి రానుంది.అత్యవసర సేవలు, హాస్పిటల్స్, వైద్య పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు, మీడియా ప్రతినిధులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

పెట్రోల్ బంకులు, విద్యుత్ సిబ్బంది, నీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బంది, ఐటీ, ఐటీ సంబంధిత సేవలకు నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర విధుల్లో ఉండే కోర్టు సిబ్బంది, న్యాయాధికారులు, స్థానిక సిబ్బంది కి కూడా ఈ సడలింపు వర్తిస్తుంది. ఇంకా బస్టాండ్, రైల్వేస్టేషన్, విమానాశ్రయాల ప్రయాణికులు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారు గర్భిణీ స్త్రీలు తగు ఆధారాలు చూపించి మీ గమ్య స్థానాలను చేరుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.