Gudivada Amarnadh : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మీమర్స్ ట్రోలర్స్ చిన్న , పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన ట్రోల్స్ చేస్తూ వీక్షకులని నవ్విస్తున్నారు.. తాజాగా ఏపీ ఐటి మంత్రి గుడివాడ అమర్నాథ్ గతంలో మాట్లాడిన పలు వ్యాఖ్యలను వారి స్టైల్ లో ట్రోల్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో వదలగా.. అది సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ కార్ రేసింగ్ కి తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులు హాజరయ్యారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఓకే వేదిక మీద కలుసుకున్నారు. ఆ ఈవెంట్ గురించి చర్చించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఆంధ్ర ప్రదేశ్ ఈ విధంగా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుందని ప్రశ్నించగా.. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది. అది పెట్ట కావడానికి కాస్త టైం పడుతుందని తెలిపారు. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తామని విశాఖపట్నాన్ని హైదరాబాద్ కి మాదిరిగా డెవలప్ చేస్తామని చెప్పారు.
ఏపీలో ఇలాంటి కార్ రేసింగ్ ఈవెంట్లు ఎప్పుడు నిర్వహిస్తారని మీడియా మిత్రులు అడుగగా.. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అది పెట్ట కావడానికి టైం పడుతుందని ..మరోసారి తనదైన శైలిలో ఏపీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. దాంతో మీమర్స్, ట్రోలర్స్ ఈ మాటల్ని ట్రోల్ చేస్తున్నారు.
గతంలో ఆయన మాట్లాడిన పలు వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రొల్ చేస్తున్నారు అందులో భాగంగా.. రెండు నెలల్లో వైజాగ్ రాజధాని కాబోతుందా.. ఎలా సాధ్యం అండి.. ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు.. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మీరు నమ్మరా.. అంటూ పలు రకాల అంశాలను తీసుకొని వాటికి ట్రోల్స్ కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.