AP: తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ విజృంభించడంతో మెడికోప్రీతి ఆత్మహత్యతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో కఠినంగా ఉండాలని మంత్రి సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు ర్యాగింగ్ అనేది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఉండాలని ఒత్తిడితో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి మరీ వారి సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆమె తెలిపారు.
అన్ని కాలేజీలలో 24 గంటలు హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని.. విద్యార్థులపై పని భారం పెరగడానికి వీల్లేదు అని… విద్యార్థులకు కౌన్సిలింగ్ ,యోగ, ధ్యానం వంటి ప్రక్రియలు అందుబాటులోకి తేవాలని ఆమె ఆదేశించారు. తెలంగాణలో మెడికోప్రీతి ర్యాగింగ్ ఆత్మహత్య కేసులో భాగంగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయి ఏపీలో ఉన్న కళాశాలలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయం.