AP High Court : ఏపీ హైకోర్టు భారీ తీర్పు చెప్పింది .. !

AP High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వివిధ యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిని ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ పోవడానికి హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.. శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టకుండా.. సంవత్సరాల తరబడి లేట్ చేయడం ఇలాంటివి వహించిన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల తీరుపై కూడా.. కోర్టు అగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేసింది.

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే నియామకాలు రాజ్యాంగం నిర్దేశించినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కావడం లేదని పేర్కొంది. అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు పద్ధతిలో బోధన, ఇతర సిబ్బంది నియామకం కోసం నూజివీడు ఆర్ జె కె టి యు రిజిస్టర్ జనవరి 8 నుంచి నోటిఫికేషన్లు అమలుని నిలుపుదల చేసింది. పిటిషనర్లు ఉద్యోగం నుంచి తొలగించవద్దని ఆదేశాలు ఇచ్చింది.

కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదన ఆదేశిస్తూ నాలుగు వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్
బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే తమ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా.. తాజాగా కాంట్రాక్ట్ విధానంలో బోధనా సిబ్బందికి నూజివీడు ఆర్ జె కె టి యు రిజిస్టర్ నోటిఫికేషన్ ఇచ్చారంటూ కే గణేష్ రెడ్డి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టక పోవడం మీద అసంతృప్తిని వ్యక్తం చేసారు.