Chitta vijay Prathap Reddy : నీ హోటల్ కు ఒక్క కస్టమర్ కూడా రాడు.. ఆడవారికి పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నా..

Chitta vijay Prathap Reddy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింత విజయ ప్రతాప్ రెడ్డి హోటల్ విసిట్ చేసి కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి ఆదేశాలు జారీ చేశారు.. కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హోటల్ కి వచ్చి హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.. అసలు ఆయన రావడానికి కారణమైన కంప్లైంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింత విజయ ప్రతాప్ రెడ్డి హరిత రాక్ రిసార్ట్ ఓర్వకల్ కి స్వయంగా వెళ్లి.. అక్కడ యాజమాన్యంతో మీ హోటల్ మీద కంప్లైంట్ ఉంది.. కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రతాప్ రెడ్డి అన్నకి హైవే లో ఉన్న ధాబాలు, హోటల్ కూడా చెక్ చేయమని మనవి.. ఓర్వకల్లు దగ్గర రాక్ గార్డెన్స్ లో వరస్ట్ ఫుడ్.. వాష్ రూమ్స్ కూడా సరిగా లేవు. మా ఆడవాళ్లకు, పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందన్న.. ఒక్కసారి గమనించగలరని మనవి అని వచ్చినా కంప్లైంట్ ను వారి ముందే చదివి వినిపించారు.

ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని వాళ్ళు చెప్పగానే.. ఎప్పుడో ఒకసారి జరిగితే ఇలా కంప్లైంట్స్ రావు. ప్రతిసారి వస్తేనే ఇలా జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే హోటల్లోని కిచెన్ లోకి వెళ్లి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు అని గమనించగా.. నిన్న వంట చేసిన ఆహారాన్ని కూడా ఫ్రిజ్లో దాచి ఉంచారు. అలాగే కొన్ని ఆహారాల పదార్థాలు ఫ్రిజ్లో నుంచి తీయగానే చెడిపోయిన వాసన కూడా వచ్చాయి. వాటిని వెంటనే డస్ట్ బిన్ లో వేయమని చెప్పారు. మీ హోటల్ సీజ్ చేస్తామని వాళ్ళకి చెప్పారు. అలాగే వాష్ రూమ్స్ కూడా క్లీన్ గా లేవని శుభ్రంగా మెయింటైన్ చేయమని ఆదేశించారు.

వాష్రూమ్స్ కూడా స్వయంగా పరిశీలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కర్నూల్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశించారు. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. కర్నూల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్ ను సీజ్ చేశారు. ఇలాంటి సమస్యలు మీ చుట్టుపక్కల ఏమైనా ఉన్నా కూడా వారి వాట్సాప్ నెంబర్ 9490551117 కి మీ సమస్యలు ఏమైనా వారికి తెలియజేస్తే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.