మార్చి 1వ తేదీ నుంచి ధరల పెంపు మోత కొనసాగుతోంది.. డీజిల్ , పెట్రోల్ ధర దగ్గర నుంచి ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు కూడా సిలిండర్ ధరలు పెరగడం.. పాల ధరలు కూడా పెరగడంతో సామాన్యుడికి మరింత భారంగా మారింది. అయితే కేవలం గ్యాస్ , పాలు మాత్రమే కాదు ఇంటి అవసరాలకు సంబంధించి అన్ని ఉత్పత్తులపై కూడా ధరలు పెంచి సామాన్యుడికి మంటలు పుట్టిస్తున్నారు. ఇకపోతే మార్చి 1వ తేదీ నుంచి అనగా ఈరోజు నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో చాలామంది పై ప్రతికూల ప్రభావం పడుతోంది అని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా గ్యాస్ సిలిండర్ ధరలను పూర్తిగా పెంచడం జరిగింది. కమర్షియల్ సిలిండర్ ధరపై 105 రూపాయలు పెంచగా.. ఇక గృహ అవసరాలకు ఉపయోగించే 5 కేజీల సిలిండర్ ధరలు కూడా పెంచడం జరిగింది.. ఇక దీనిపై 27 రూపాయల మేర ధరలు పెరిగాయి. అమూల్ పాల ఉత్పత్తులు కూడా పెరగడం గమనార్హం. మార్చి 1వ తేదీ నుంచి అమూల్ గోల్డ్ పాల ధర 30 రూపాయలకు చేరుకుంది. ఇక అమూల్ టాజా పాల ధర రూ. 24 చేరగా .. అమూల్ శక్తి పాల ధర 27 రూపాయలకు పెరిగింది..

ఇవే కాకుండా హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వారు కూడా ఉత్పత్తుల ధరలను పెంచడం జరిగింది. సబ్బులు, పౌడర్ వంటి వాటి ధరలపై ఏకంగా తొమ్మిది శాతం మేర ధరలు పెంచడం సామాన్యుడికి భారంగా మారనుంది. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ , కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్, డవ్ బాడీ వాష్ , లక్స్ , లైఫ్ బాయ్ , పియర్స్ వంటి సబ్బులపై కూడా ధరలు ఫిబ్రవరి నెలలో రెండు సార్లు పెరగగా ఇప్పుడు మళ్ళీ ధరలు పెంచారు. రోజు రోజుకి నిత్యావసర వస్తువులపై ధరలు పెంచుతూ పోతుండడంతో సామాన్యుడికి మరింత భారంగా మారనుంది.. కరోనా వల్ల ఆదాయం తక్కువ.. ఖర్చులు కూడా పెరుగుతూ ఉండడంతో సామాన్యులు మరింత ఇబ్బంది పడుతున్నారు.