Realme : రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ఫీచర్స్ అదుర్స్..!

Realme : రియల్ మీ ఈ మధ్య కాలంలో సరికొత్త స్మార్ట్ ఫోన్లను కస్టమర్ల కోసం ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా Realme GT నియో 3T స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇక లాంచ్ సమయంలో త్వరలో అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ క్రమంలోనే ఈ స్మార్ట్ ఫోను భారతదేశంలో సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. రియల్ మీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ ను తెలియజేయడానికి మైక్రో సైట్ ను కూడా రూపొందించడం గమనార్హం.

Realme GT నియో 3T స్మార్ట్ ఫోన్లో 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని రియల్ మీ సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇక రేసింగ్ ఫ్లాగ్ వెనుక భాగంలో ఉంటుందని కూడా కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే రియల్ మీ విడుదల చేసిన టీజర్ లో ఈ స్మార్ట్ ఫోన్ 5జి కనెక్టివిటీని కలిగి ఉంటుందని స్పష్టం అవుతుంది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మిగతా ఫీచర్లను కూడా క్రమంగా ప్రకటిస్తాము అని రియల్ మీ స్పష్టం చేసింది. ఇకపోతే సెప్టెంబర్ 10వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ , రిఫ్రెష్ రేట్ గురించి అన్ని వివరాలను వెల్లడిస్తామని కూడా అధికారిక వెబ్సైట్ ద్వారా రియల్ మీ వెల్లడించింది.

Another smartphone launch from Realme, Realme smartphone Features
Another smartphone launch from Realme, Realme smartphone Features

ఈరోజు దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ 6.62 అంగుళాల E4 AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.120 Hz రీఫ్రెష్ రేటుతో, HDR 10+ సపోర్ట్ తో రానుంది. ఇక 8GB ర్యామ్ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక కెమెరా విషయానికే వస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెన్సార్లతో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ , 2 మెగాపిక్సల్ మైక్రో లైన్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు 16MP సెల్ఫీ కెమెరా కూడా అమర్చబడి ఉంది . 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా అమర్చారు.