ప్రముఖ టెక్ దిగ్గజం రెడ్ మీ తాజాగా మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇకపోతే రెడ్ మీ 11 ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్లు సెప్టెంబర్ 6వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఇకపోతే లాంచ్ చేయడానికి కంటే ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అన్ని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని కూడా విడుదల చేయడం గమనార్హం. ఇక ఈ మేరకు కంపెనీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ తేదీని కూడా ప్రకటించడం జరిగింది. ఇకపోతే సాధారణంగా తాజాగా లాంచ్ చేయబోతున్న స్మార్ట్ ఫోన్ ధర రూ.10,000 పరిధిలోకి వస్తుంది.. కానీ 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి ధర రూ.11,000 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నా సరే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు..
లాంచ్ అవ్వబోతున్న రెడ్మి లెవెన్ ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్.. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా సెన్సార్ తో పాటు డ్యూయల్ కెమెరా రియల్ సెటప్ తో లభిస్తుంది. బడ్జెట్ ఫోన్ హుడ్ కింద మీడియా టెక్ డైమన్సిటీ 700 ఎస్ఓసిని అందిస్తుంది. ఇక ఇందులో ఆడియో జాబు తో పాటు డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీతో విడుదలబోతోంది. ఇకపోతే వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించడం లేదు. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండవచ్చు అని ఊహాగానం వ్యక్తం అవుతుంది. ఇక అంతేకాదు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో రెడ్ మీ ఏం డిస్ప్లే సెన్సార్లు అందిస్తుందని ఆశించడం కొంచెం కష్టమే అవుతుంది.
ఇక మిగిలిన వివరాల విషయానికి వస్తే.. రెడ్మి 11 ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్.. ఇదే సంవత్సరం రోజున చైనాలో మార్చిలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11E 5G స్మార్ట్ ఫోన్ కి రీ బ్రాండెడ్ అని తెలుస్తోంది. ఇకపోతే 6.5 8 అంగుళాల డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఒక సెల్ఫీ కోసం ఫైవ్ ఎంపి ఫ్రంట్ కెమెరాను అమర్చారు.18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తునట్లు సమాచారం.