Best Smart Watch : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ , స్మార్ట్ టీవీ ఉన్నట్టుగానే స్మార్ట్ వాచ్లు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ స్మార్ట్ వాచ్ లు కూడా కస్టమర్లకు మరింత సపోర్టుగా నిలుస్తున్నాయి. ఇకపోతే తాజాగా Ptron తన కొత్త స్మార్ట్ వాచ్ Ptron Force X10 ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక ఈ కంపెనీ ఈ వాచ్ ధరను కేవలం రూ.1,499 గా నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 4 నుండి అందుబాటులోకి వచ్చింది. ఇక విశేషమేమిటంటే పరిచయ ఆఫర్ కింద మొదటి వందమంది కస్టమర్లకు కేవలం రూ.99కే పొందే అవకాశాన్ని కల్పించారు ఈ కంపెనీ.
ఇకపోతే 1.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేక బ్రైట్నెస్ ఫీచర్ ని కూడా కలిగి ఉంది. ఇక వినియోగదారులు సూర్యకాంతిలో కూడా స్క్రీన్ ను సౌకర్యవంతంగా చూడవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ తో వినియోగదారులు నిజ సమయంలో బ్లడ్ ఆక్సిజన్ రేటును కూడా పర్యవేక్షించగలరు. Ptron Force X10 నాలుగు రంగుల ఎంపికలలో వస్తుంది. గ్లామ్ బ్లాక్, ప్యూర్ బ్లాక్, స్పేస్ బ్లూ, సీడెడ్ పింక్ వంటి కలర్ లో అభ్యమవుతుంది. ఇకపోతే Ptron Fit+ యాప్ తో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఇక ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటితో కూడా పనిచేస్తుంది. వినియోగదారుల ఆరోగ్య డేటాను కూడా సరిగ్గా ట్రాక్ చేస్తుంది.
అంతేకాదు ఈ స్మార్ట్ వాచ్ IP68 రేటింగ్ తో లభిస్తోంది. వాటర్ ప్రూఫ్ ను కూడా కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ వాచ్.. ఇక రైస్ అండ్ వేకప్ డిస్ప్లే లు , బ్లూటూత్ ద్వారా కెమెరా కంట్రోల్ , మ్యూజిక్ కంట్రోల్ , మల్టిపుల్ వాచ్ ఫేస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ వాచ్ లో మరెన్నో అద్భుతమైన ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం మొదటగా ఎవరైతే వంద మంది రిజిస్టర్ చేసుకుంటారో వారికి కేవలం 99 రూపాయలకి ఈ స్మార్ట్ వాచ్ లభించడం చాలా ఆశ్చర్యకరం. ఇకపోతే ఇప్పటికే చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు కూడా త్వరపడి ఈ వాచ్ ను రూ. 100 లోపే సొంతం చేసుకోండి.