Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికల జోరు కొనసాగుతోంది . అన్ని పార్టీలు కూడా ఫుల్ జోష్లో ఉన్నాయి. ఇప్పటినుంచి ఎన్నికల వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మభ్యంతర ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారని చట్ట ప్రకారం పని చేస్తే సమాజంలో గుర్తింపు వస్తుంది కానీ . జగన్ మాత్రం ఎన్నికల్లో డబ్బులతో గెలుస్తామన్న ధీమాకు వచ్చారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ను ఇంటికి పంపించడానికి ప్రజల సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ చేస్తున్న పనులకు చంద్రబాబు చెబుతున్న మాటలకు మధ్యంతర ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ మరికొంతమంది అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు.