Andhra Pradesh: ఎమ్మెల్సీల్లో కూడా 5 జిల్లాలలో ఏకగ్రీవం..?

Andhra Pradesh.. రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపీ ఏకగ్రీవ విజయాలను నమోదు చేస్తోంది.. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా వీటిలో ఐదు స్థానాలలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.

YCP Should Not Drop Kukka Biskatlu to Psycho Ladies! | cinejosh.com

శుక్రవారం రోజు జరిగిన నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నియోజకవర్గాలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 27వ తేదీ వరకు గడువు ఉంటుంది . అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎస్ మంగమ్మ, చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం కానున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేరిగ మురళి ఏకగ్రీవం కానున్నారు.