Andhra Pradesh: గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.2,500 పెంచుతూ..!

Andhra Pradesh..గ్రామ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అమరావతిలో భూమిలేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు నెలకు రూ.2,500 పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి .. ముఖ్య మంత్రి జగన్ ఆదేశాల మేరకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ పథకం అమరావతి గ్రామ వాలంటీర్లకు వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు.. అమరావతిలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులు గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోని వీరిని ఉద్యోగులుగా పరిగణించి ప్రతినెల భూమిలేని నిరుపేద కుటుంబాలకు రూ.2,500 పింఛన్ మంజూరు చేస్తున్నారు.

Advertisement

AP offers political stability, strong governance: Jagan

Advertisement

నిరుపేద కుటుంబాలకు చెందిన గ్రామ వాలంటీర్లు ప్రధాన కార్యదర్శి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా శ్రీలక్ష్మి సమస్యను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం జగన్ వారికి పెన్షన్లు అందించాలని ఆదేశించారు. అమరావతిలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు మార్చి 1వ తేదీ నుంచి పెన్షన్ అందిస్తున్నామని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి స్పష్టం చేశారు.

Advertisement