AP Government: ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..!!గతంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు ఉండేది. ప్రస్తుతం దానిని 62 సంవత్సరాలకు పెంచుతూ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్నీ మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్ కు పంపించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఆర్డినెన్స్ ఫైలుపై గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోదం తెలుపుతూ సోమవారం సంతకం చేశారు.1 జనవరి 2022 మంచి ఈ ఉత్తర్వులు అమలు చేయనున్నట్లుగా ఆర్డినెన్స్ లో ప్రభుత్వం పేర్కొంది. ఈరోజు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కావలసి ఉంది. ఈ పాటికే వారికి రిటైర్మెంట్ కావలసిందిగా తగు నోటీసులు కూడా జారీ చేశారు.

ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ ఆర్డినెన్స్ రాకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. సాయంత్రం ఈ జీవోను విడుదల చేయగా నేడు పదవి విరమణ చేసే వారికి ఊరట లభించింది. మరోవైపు పిఆర్సి జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతుంటే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.