Anchor Lasya..బుల్లితెరపై తనకంటూ యాంకర్ గా ఒక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ లాస్య. ముఖ్యంగా ఈమె చెప్పే చీమ, ఏనుగు జోకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. గతంలో యాంకర్ రవితో కలిసి చేసే ప్రోగ్రాములలో కూడా హైలెట్గా నిలుస్తూ ఉండేది. ఇక బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనింది. ఇదిలా వుండగా తాజాగా లాస్య ఇప్పుడు మరోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా తెలియజేయడం జరిగింది.
ఇట్స్ ఏ బేబీ బాయ్ అని పోస్ట్ చేసింది. లాస్య ఎప్పటికప్పుడు తన అప్డేట్లను సైతం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంది. తన బేబీ బంప్ ఫోటోలను, సీమంతం ఫోటోలను కూడా అందరితో పంచుకున్నది. దీంతో ఈమె అభిమానుల సైతం ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక యాంకర్ లాస్యకు మొదటిసారి కూడా కొడుకే పుట్టారు. తనను ఆప్యాయంగా జున్ను అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం లాస్య షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.
View this post on Instagram