Akash Ambani: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి.. ముఖేష్ రెండో కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలో గురువారం అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్ కి పలువురు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు.. అయితే ఈ నిశ్చితార్థ వేడుకల్లో అంబానీకి అవమానం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది..
ముందుగా అంబానీ కుమార్తె ఈషా తొలుత వీరేన్ మర్చంట్ నివాసానికి వెళ్లి లాంఛనంగా వారిని ఆహ్వానించింది. అపుడే తనతోపాటు ముకేష్ అంబానీ తోపాటు అనంత్ అంబానీ కూడా వాళ్ళని తమ ఇంటికి రమన్ని ఆహ్వానించడానికి వెళ్లగా.. అనంత్ అంబానీని అక్కడ ఎవ్వరూ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదట.. కాబోయే అల్లుడికి ఇప్పుడే మర్యాదలు సరిగ్గా రిసీవ్ చేసుకోవడం లేదంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్ని లక్షల కోట్లు ఉండి ఏం లాభం అంబానీ ముందే తన కొడుకుని సరిగ్గా రిసీవ్ చేసుకోవడం లేదు. ఇలాంటి వాళ్ళు ముందు ముందు తన కొడుకు ఎలాంటి విలువ ఇస్తారు ఏంటో అంటూ వారి సన్నిహితులు చెవులు కోరుకొంటున్నారట..
ఇక తమ నివాసానికి వచ్చిన మర్చంట్ కుటుంబ సభ్యులను అంబానీలు ఘనంగా ఆహ్వానించారు. అనంత్, రాధిక శ్రీకృష్ణ మందిరంలో తమ కుటుంబ సభ్యుల ఆశీస్సులు తీసుకుని నిశ్చితార్థ వేదికపైకి వచ్చారు. ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేసి ఆ తరువాత లఘ్న పత్రికను చదివి అందరికీ వినిపించారు.
ఈ నిశ్చితార్థ వేడుకలో గుజరాతీ సంప్రదాయాలను పాటిస్తూ, అంబానీ, మర్చంట్ కుటుంబ సభ్యులు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇక ఈ నిశ్చితార్థం వేడుకలో అంబానీ తన భార్యతో కలిసి చిందేశారు. అనంత్, రాధిక ఉంగరాలు మార్చుకోవడంతో నిశ్చితార్థం పూర్తయింది. రాధిక బంగారు జరీ లెహెంగా ధరించగా, అనంత్ నేవీ బ్లూ కుర్తా, డార్క్ హ్యూ జాకెట్ తో దర్శనమిచ్చారు. వీరి వివాహం ఈ ఏడాదే జరగనుందని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ తారలు తరలి రావడం మరో స్పెషల్ అట్రాక్షన్..