Anasuya: బుల్లితెరపై యాంకర్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. రంగస్థలం సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకున్న ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలో ఉన్నాయి.. తాజాగా అనసూయ పెద్దాపురం షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో చీరకట్టులో మెరిసింది. డీజే టిల్లు బ్యూటీతో కలిసి డీజే టిల్లు సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసింది అను.. కాగా పెద్దాపురంలో తనకు అభిమానులు ఇచ్చిన ఆనందానికి ఓ మ్యాజికల్ వీడియోను పోస్ట్ చేసింది..
ఎక్కువగా చీరల్లో కనిపించే అనసూయ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి లేత గులాబీ రంగు చీరలో కనిపించి సందడి చేసింది. పెద్దాపురంలో అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ఫిదా అయినా అనసూయ మ్యాజికల్ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చీరలో అందంగా తయారైన అనసూయ సొగసు చూడతరమా అంటూ తన వీడియోకి ఓ పాట జోడించి పోస్ట్ చేసింది. బెడ్ పై ఇలా పడుకొని బేబీ గర్ల్ అంటూ ముద్దుగా తనకు తాను కంప్లీమెంట్ ఇచ్చుకుంది.. ఈ వీడియోకు ఏదైనా మ్యాజిక్ మనలోనే ఉంటుందని.. చూసేవాళ్ళ కళ్ళల్లో కాదంటూ క్యాప్షన్ పెట్టేసింది అనసూయ.