Anasuya : అమెరికాలో పరాయి మగాడితో తన భార్య ఫోటో దిగడం మీద అనసూయ భర్త భరద్వాజ్ స్పందన

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ప్ర‌స్తుతం తన వ‌ర్క్‌కి బ్రేక్ ఇచ్చి విదేశాల‌కి వెళ్లింది. అక్కడ ఈ అమ్మ‌డు చేసే సంద‌డి మాములుగా లేదు. అయితే అన‌సూయ ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదం త‌ప్ప‌క ఉంటుంది. ఆ మ‌ధ్య లైగర్ మూవీ ఫెయిల్యూర్ పై అనసూయ ట్వీట్ చేస్తూ… ఆనాడు అమ్మను తిట్టిన పాపం వెంటాడి లైగర్ మూవీ ప్లాప్ కి కారణమైందని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ విజయ్ దేవరకొండ అభిమానులను హర్ట్ చేయ‌డంతో వారు ఆంటీ అంటూ ట్రోల్స్ కి తెగబడ్డారు. అయిన‌ప్ప‌టికీ అన‌సూయ త‌గ్గేదే లే అన్న‌ట్టు దూసుకుపోతుంది. త‌న‌ను ఎంత మంది ట్రోల్స్ చేసిన కూడా త‌గ్గేదే లే అన్న‌ట్టు దూసుకుపోతుంది.

anasuya-husband-reaction-is-this
anasuya-husband-reaction-is-this

క్లారిటీ వ‌చ్చేసింది..

ఇటీవల తానా వేడుకల కోసం అనసూయ అమెరికా వెళ్లింది.. అక్కడి తెలుగు వాళ్లతో కలిసి తెగ సంద‌డి చేసింది. ఇక ఆ ట్రిప్ ముగిసిన వెంటనే అనసూయ టెక్సాస్ లో ప్రత్యక్షం కాగా, అందుకు సంబంధించిన ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే ఆమె షేర్ చేసిన పిక్స్ లో ఓ ఫోటో సందేహాలకు దారితీసింది. ఆమె ఒక వ్యక్తి పక్కన నిల్చొని సెల్ఫీ దిగ‌గా అత‌ని గురించి నెటిజ‌న్స్ తెగ ఆరాలు తీసారు. అన‌సూయ ప‌క్క‌న ఉన్న వ్య‌క్తి ఎవ‌రై ఉంటాడు అని జుట్టు పీక్కున్నారు. అయిత‌ అతని పేరు ఉజ్వల్ కస్టాల అని అనసూయ పోస్ట్ లో తెలియజేశారు. అమెరికాలో ఉజ్వల్ ని కలిసిన అనసూయ బర్త్ డే విషెస్ తెలియజేయ‌డ‌మే కాక ఆయ‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది.

అయితే భ‌ర్త‌ని వ‌దిలేసి అమెరికాకి వెళ్లిన అన‌సూయ వేరే వ్య‌క్తితో స‌న్నిహితంగా మెలిగే స‌రికి నెటిజ‌న్స్ ఆమెను తెగ ట్రోల్స్ చేశారు. కొంద‌రు బూతులు తిడుతూ ట్రోల్ చేయ‌గా, మ‌రి కొంద‌రు ఇద్ద‌రు పిల్లలు ఉన్న నువ్వు ఇలాంటి ప‌నులు చేస్తావా అంటూ విమ‌ర్శించారు. ఈ విష‌యంలో అన‌సూయ భ‌ర్త కూడా చాలా ఫైర్ అవుతున్నాడ‌ని, ఇండియాకి వ‌చ్చాక విడాకులు తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని నానా పుకార్లు పుట్టించారు. కాని అత‌ను అన‌సూయ‌కి బ్ర‌ద‌ర్ లాంటి వాడు అని , అన‌సూయ యూఎస్ వెళ్లిన‌ప్పుడల్లా ఆమెకి తోడుగా ఉంటాడ‌ని అన‌సూయ భ‌ర్త త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పుకొచ్చాడ‌ట‌. జ‌నాలే ఏదో ఊహించేసుకుంటున్నారే త‌ప్ప అక్క‌డ ఏమి లేద‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు స‌మాచారం.