Anasuya: న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ.. జబర్దస్త్ షోలో యాంకర్ గా బుల్లితెరకు పరిచయమై అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది ..సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది .. ఆ తరువాత వెండి తెరపై మెరిసింది.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించింది.. అనసూయ పుష్ప సినిమాతో విలన్ గా అవతారం ఎత్తింది..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ వన్ లో డి గ్లామర్ లుక్ లో దాక్షాయిని పాత్రలో నటించిన అనసూయ.. రెడ్ శాండిల్ స్మగ్లర్ భార్యగా ప్రేక్షకులను మెప్పించింది. ఇక సెకండ్ పార్ట్ లో కూడా బ్యాడ్ గర్ల్ పాత్రలో కనిపించనుంది. ఎంతో సుకుమారంగా ఉండే అనసూయ ఈమేనా అనేంతగా పుష్ప సినిమాలో కనిపించింది..
దర్జా సినిమాలో కూడా అదే తీరు. జనాన్ని భయపెట్టే లేడీ గ్యాంగ్స్టర్ రోల్ లో అనసూయ కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించింది రవితేజ హీరోగా నటించిన కిలాడీ సినిమాలో అనసుయా ట్రాన్స్ఫర్మేషన్ కి దిమ్మ తిరిగినంత పనైంది. షార్ట్ ఫ్రాక్ లో రవితేజ క్రైమ్ పార్ట్నర్ గా నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించింది. తాజాగా మైకేల్ సినిమా టీజర్ విడుదలైంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనసూయ మళ్లీ నెగెటివ్ షేర్ లోనే కనిపించింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ చిత్రంలో అనసూయ దేవదాసుగా కనిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనసూయ కి వరుసగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్స్ వరుస ఆఫర్స్ ఉండటంతో స్మాల్ స్క్రీన్ పై అనసూయ కనిపించడం లేదు.. అనసూయ తనలోని మరో యాంగిల్ ని బయట పెడుతుంది. ఈ మధ్యకాలంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను యాక్సెప్ట్ చేస్తూ అనసూయ లేడీ విలన్ గా మారిపోతుంది..