America.. గత రెండు సంవత్సరాల కిందటి వరకు ప్రజలు కరోనా మహమ్మారితో అతలాకుతలం అయ్యారు.. కరోనా మహమ్మారి పోయిందిలే అని అంత ఊపిరి పీల్చుకునే సమయంలో ఇప్పుడు అమెరికాను జాంబి అనే డ్రగ్ వణికిస్తోంది. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్ ఇప్పుడు అక్కడ పెనువిలయానికి దారితీస్తోంది. దీన్ని ఫెంటానిల్ అనే డ్రగ్ తో కలిపితే అత్యంత హెచ్చు పొటెన్సీ తో కూడిన ప్రాణాంతకమైన మత్తుమందుగా మారుతుంది.
చాలా తక్కువ దొరికే తయారవుతుండడంతో డ్రగ్ డీలర్లు కూడా కొన్నేళ్లుగా దీనిని విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా డ్రగ్ బానిసలు ట్రాంక్ మత్తులో జోగుతూ కనిపిస్తున్నారు. అయితే ఇది శరీరంపై దుష్ప్రభావాలను కలిగిస్తోంది. ఒంటిపై పుండ్లు, చర్మం ఊడిపోవడంతో మొదలయి చూస్తుండగానే ఒంట్లో శక్తులన్నీ కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతుంది.. పరిస్థితి చూస్తుంటే అచ్చం శవాల్లా మారి జాంబీలను తలపిస్తున్నారు. ఈ ధోరణి గత కొంతకాలంగా మరీ ప్రమాదకరస్థాయిలో పెరిగిపోతుంది. మరి ఇకనైనా అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.