Smart Glasses : పేరుకే కళ్ళజోడు.. వెరీ స్మార్ట్ గురూ..!!

Smart Glasses : అధునాతన టెక్నాలజీతో పనిచేసే ఉత్పత్తులను తయారు చేయడంలో భారతదేశ కంపెనీలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. మరొక భారతీయ టెక్ కంపెనీ అయిన Ambrane తన కంపెనీ నుంచి Glares మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇక ఇవి చూడడానికి కళ్ళజోడు లాగా కనిపిస్తాయి . కానీ వీటి ఫీచర్స్ తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.. ఇకపోతే ఈ గ్లాసెస్ ను ఓపెన్ ఇయర్ ఆడియో గ్లాస్సెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఇందుకు కారణం ఫ్రేమ్ లో ఇన్బిల్డ్ గా రూపొందించిన స్పీకర్లతో రావడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ గ్లాసెస్ లో బ్లూ టూత్ v5.1 అందిస్తున్నారు.

అంతేకాదు పరిసరాలకు అనుగుణంగా లెన్స్ ని కూడా మార్చుకోవచ్చు. ఇక అందుకు అనుమతించే విధంగా టూ లెన్స్ ఆప్షన్స్ కూడా కలిగి ఉన్నాయి. స్పీకర్ సిస్టం కూడా ఇందులో ఇన్బుల్ట్ చేయబడింది. రెండు గంటల చార్జింగ్తో 7 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ గ్లాసెస్ యొక్క ఆకృతి విషయానికి వస్తే.. స్క్వేర్ మరియు రౌండ్ షేప్ ను కలిగి ఉంటుంది. రెండింటిలోనూ వచ్చే అద్దాలు ఇవి రక్షణను కలిగిస్తాయి అని కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే ప్రస్తుతం అంబ్రేన్ గ్లేర్స్ ధర రూ.9,999 గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ వెబ్సైటు ద్వారా మీరు రూ.5000 తగ్గింపు తో కేవలం రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు.

Ambrane company has launched Smart Glasses
Ambrane company has launched Smart Glasses

ఇక రెండు కూడా బ్లాక్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉన్నాయి.అంతేకాదు ఈ గ్లాసెస్ మీరు మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకుంటే కాల్స్ ను యాక్సెప్ట్ చేయవచ్చు లేదా రిజెక్ట్ కూడా చేయవచ్చు. మ్యూజిక్ ప్లే బ్యాక్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు అలాగే వాయిస్ అసిస్టెంట్ ద్వారా గ్లాసెస్ ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్లాస్సెస్ టెంపుల్ పై మౌంట్ చేయబడిన టచ్ కంట్రోల్ సపోర్ట్ తో ఇన్బిల్ట్ స్పీకర్లతో వస్తాయి. ఈ గ్లాసెస్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ పరికరాలకు అనుకూలంగా పనిచేస్తాయి. ముఖ్యంగా యువి కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ 99.99 శాతం రక్షణను కల్పిస్తాయని కంపెనీ తెలిపింది. ఇక ప్రస్తుతం ఆఫర్ ధరలో లభిస్తున్న నేపథ్యంలో కొనుగోలు చేయాలనుకున్న వారు త్వరపడితే మంచిది.