Amazon : ప్రస్తుతం త్వరలో దసరా , దీపావళి వంటి పెద్ద పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తోంది. ఇకపోతే ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై అలాగే కిచెన్ వస్తువుల పై కూడా భారీ డిస్కౌంట్ ను అందించే అవకాశం ఉంది. ఇకపోతే కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఎలాంటి వస్తువులపై ఎంత డిస్కౌంట్ లభించనుంది? అనే విషయాలను ఇప్పుడు మనం క్లుప్తంగా చదివి తెలుసుకుందాం..ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇక అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ రెండూ కూడా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి తమ అమ్మకాలను మొదలుపెట్టనున్నాయి. ఇకపోతే అమెజాన్ తన ఫ్లాట్ ఫారం లో సేల్ గురించి సమాచారాన్ని వెల్లడించింది. ఇకపోతే ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 30వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. కానీ అమెజాన్ మాత్రం ఎన్ని రోజులు ఈ సేల్ నిర్వహించబోతోంది అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గేమింగ్ డివైస్లు, లాప్టాప్ లు గృహాపకరణాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించనున్నారు. కాబట్టి వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు భారీగా డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంటుంది. అమెజాన్ అందిస్తున్న ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్ ఫోన్లు అలాగే ఇతర గాడ్జెట్ లపై 40% తగ్గింపు లభిస్తుంది.
సామ్సంగ్, షావోమీ , ఐక్యూ స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు యాపిల్ ఐఫోన్ లపై కూడా ప్రత్యేక తగ్గింపు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇకపోతే షావోమి Redmi 11 prime 5G అలాగే IQOO Z6 Lite 5G రెండు స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ చేయబడుతున్నాయి. ఇకపోతే అమెజాన్ లో వస్తువులను కొనుగోలు చేసే వారికి ఎస్బిఐ బ్యాంకు కార్డులు అలాగే ఐసిఐసిఐ బ్యాంకు కార్డులపై కార్డు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఎస్బిఐ కార్డు హోల్డర్లకు 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే అమెజాన్ పే , ఐసిఐసిఐ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది.స్మార్ట్ టీవీ లపై 70% తగ్గింపు తో పాటు గృహాపకరణాలపై 50% తగ్గింపు పొందవచ్చు. ఇక గేమింగ్ పరికరాలపై 50% తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.