Amazon ; ప్రముఖ ఈ – కామర్ సంస్థ అమెజాన్ స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ సేల్ నిర్వహిస్తోంది . ఇక ఇందులో భాగంగానే సాంసంగ్ గాలక్సీ M13 ప్రారంభ ధర రూ.11,999 కి అందుబాటులో ఉండగా.. ఉత్తమ ఆఫర్ కింద కస్టమర్లు ఈ ఫోన్ ను ఏకంగా రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ సేల్ లో కస్టమర్లు 40 శాతం వరకు తగ్గింపుతో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే నో కాస్ట్ ఈ ఎం ఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల వరకు తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ M13 : 4G వెర్షన్ స్మార్ట్ ఫోన్ 60 Hz రీఫ్రెష్ రేట్ తో అలాగే వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ తో 6.6 అంగుళాల 1080 p LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే లభిస్తుంది. ఇక సిక్స్ జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ one UI కోర్ 4 సాఫ్ట్వేర్ పై పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే .. ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్ తో 50 MP ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ అలాగే 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.
ఇక సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరాను అందించడం గమనార్హం. 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ని అందించబడుతుంది.ఇక కనెక్టివిటీ కోసం.. ఈ ఫోన్లో బ్లూటూత్, NFC, WiFi, వంటివి అందులో బాటలో ఉన్నాయి. ఇకపోతే ఎవరైనా సరే స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచించేవారికి సాంసంగ్ లో అమెజాన్ అందిస్తున్న బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక అమెజాన్ రూ.2,000 తగ్గింపుతో అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా మరో రూ.2 వేలు కూడా తగ్గింపు లభిస్తుంది . మొత్తం రూ. 4,000 తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.