Amazon : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ 2022 సేల్ ప్రకటించింది. రియల్ మీ ఫోన్ లపై గొప్ప ఆఫర్లను అలాగే డీల్స్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇక ఈ ఫోన్లో ప్రీపెయిడ్ ఆప్షన్ తో కొనేవారికి 1500 రూపాయల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.. ఈ ఫెస్టివల్ లో భారీ డిస్కౌంట్ లభించడమే కాకుండా అద్భుతమైన స్మార్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ సేల్ నుండి లేటెస్ట్ బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 50 పైన మంచి డీల్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ హీలియో జీ96 ఆక్టా కోర్ గేమింగ్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అంతేకాదు 120 Hz హై రిఫ్రెష్ రేటు, అలాగే 33 W డార్ట్ చార్జ్ వంటి ఆకర్షణీమైనా ఫీచర్లతో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుగోలు చేయాలనుకుంటే realme.com లేదా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ కూడా ఈ స్మార్ట్ ఫోన్ పై లభిస్తుంది. ఇక రియల్ మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో రూ.12,999 ప్రారంభ ధరతో మొదలవుతుంది. ఇక రెండవ వేరియంట్ 6 GB ర్యామ్ + 128GB స్టోరేజ్ తో రూ. 15,499 ధరతో ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా 1500 రూపాయల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ విషయానికి వస్తే 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది.
120 Hz రిఫ్రెష్ రేటు తో పాటు డిస్ప్లే 90% స్క్రీన్ టు బాడీ రేషియో అలాగే 180 టచ్ శ్యాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. 50 ఎంపీ మెగా పిక్సెల్ సెన్సార్, 2 ఎంపీ మైక్రో సెన్సార్, 2 ఎంపీ బి అండ్ డబ్ల్యు కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్లో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. మరియు స్పీడ్ బ్లూ, స్పీడ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుంది. ఇక కొనుగోలు చేయాలనుకునేవారు ప్రముఖ ఈ కామర్ సంస్థ అమెజాన్ ద్వారా కూడా నో కాస్ట్ ఈఎంఐ తో కొనుగోలు చేయవచ్చు.