Amazon Prime Day 2022 : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ మరొకసారి వార్తల్లో నిలిచింది. తమ కష్టమర్లను ఆకర్షించుకోవడానికి గృహోపకరణాలపై ఊహించని స్థాయిలో తగ్గింపు ధర కే అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే గృహోపకరణాల కింద ఉపయోగించే వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్, ఏసి, ఫ్రిజ్ వంటి అనేక గృహప్రకరణాలను పూర్తిస్థాయి తగ్గింపులో మీరు సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఆఫర్ ముగించే లోపు ఈ వస్తువులను కొనుగోలు చేసి వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.. ఇక అమెజాన్ అందిస్తున్న ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
LG వాషింగ్ మిషన్.. : రూ.46,990 ధర కలిగిన వాషింగ్ మిషన్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగంగా కేవలం రూ.29,490 కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ వాషింగ్ మిషన్ పై మీరు ఏకంగా 17,500 రూపాయలను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. సెవెన్ కేజీ ఇన్వర్టర్ టచ్ ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ విత్ హీటర్తో ఆకర్షణీయమైన ధరలో మనకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ వాషింగ్ మిషన్ లో ఫ్రంట్ ఆటో రన్నింగ్ సిస్టం కూడా ఉంది అలాగే ఆరు మోషన్ డిడి సాంకేతికత కూడా ఉపయోగించబడుతుంది. ఇక ప్రతి రకమైన ఫ్యాబ్రిక్లను మీరు చాలా సులభంగా వాష్ చేసుకోవచ్చు..
Hisense సైడ్ బై సైడ్ డోర్ రిఫ్రిజిరేటర్ : రూ.74,990 విలువ కలిగిన రిఫ్రిజిరేటర్ ను మీరు కేవలం రూ.55,990 కే సొంతం చేసుకోవచ్చు అంటే 19,000 రూపాయలను మీరు ఆధా చేసుకునే అవకాశం ఉంటుంది. 564 లీటర్ ఇన్వర్టర్ ఫ్రాఫ్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ డోర్ రిఫ్రిజిరేటర్ విత్ వాటర్ డిస్పెన్సర్ తో లభిస్తుంది. ఇక ఒక సంవత్సరం వారంటీతోపాటు, కంప్రెసర్ 10 సంవత్సరాల వారంటీని మీరు పొందవచ్చు. అంతేకాదు ఇందులో డిజిటల్ కంప్రెసర్ కూడా ఉంది.
ఎల్జి మైక్రోవేవ్ ఓవెన్ : రూ.23,500 కలిగిన ఈ మైక్రోవేవ్ ఓవెన్ మీరు అమెజాన్ ప్రైమ్ డే సేల్ ద్వారా 18% డిస్కౌంట్తో రూ.19,305 కే సొంతం చేసుకోవచ్చు. 28 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ మైక్రోవేవ్ ను వంట చేయడానికి బేకింగ్ రీ హీటింగ్ గ్రిల్లింగ్ డి ఫాస్టింగ్ కోసం మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక అంతేకాదు టైమర్ ని మీరు బటన్ ద్వారా సెట్ చేయవచ్చు. ఇక మీరు మైక్రోఓవెన్ తో పాటు ఒక గ్లాసు ట్రే, ఒక రోటిస్సేరి హ్యాండిల్, ఒక రొటేటింగ్ రింగ్, ఒక మల్టీ కుక్ తవా, ఒక సెల్ఫ్, ఒక మిల్క్ పాయిస్టరైజేషన్ కిట్ లాంటివి లభిస్తాయి. వీటితోపాటు మరెన్నో వస్తువులపై మీరు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది