Amazon Great Indian Festival : అమెజాన్ మరోసారి స్మార్ట్ టీవీ లపై బంపర్ ఆఫర్.. 60% పైగా డిస్కౌంట్..!

Amazon Great Indian Festival :  ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా స్మార్ట్ టీవీ లపై కూడా ఆఫర్లు ప్రకటించి.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బడ్జెట్ రేంజ్ లో హెచ్డి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూసే వారికి అమెజాన్ అద్భుతమైన తీపి కబురు అందించింది. ఈ కామర్స్ కంపెనీ తన ఆన్ గోయింగ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అమెరికన్ బ్రాండ్ వెస్టింగ్ హౌస్ టీవీ మోడల్స్ పై 60 శాతంకి పైగా డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు విషయానికి వస్తే.. రూపే, కోటక్, ఐసిఐసిఐ, సిటీ బ్యాంక్ వంటి క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అమెజాన్ నుంచి అడిషనల్ గా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ , ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.అయితే ఆమెజాన్ ప్రవేశపెట్టిన ఈ సేల్ అక్టోబర్ 23వ తేదీ వరకు కొనసాగుతుంది.

Advertisement
Amazon once again bumper offer on smart TVs.. more than 60% discount.
Amazon once again bumper offer on smart TVs.. more than 60% discount.

వెస్టింగ్ హౌస్ 24 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ:
ఈటీవీ మీకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా 24 అంగుళాల వెస్టింగ్ హౌస్ టీవీ ని కేవలం రూ.5,499 కే సొంతం చేసుకోవచ్చు. హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 20W స్పీకర్ అవుట్ పుట్ రెండు స్పీకర్లు, ఆడియో ఈక్విలైజర్, ఆటోమేటిక్ వాల్యూం లెవెల్ వంటి ఆడియో ఫీచర్లతో లభిస్తుంది.

Advertisement

వెస్టింగ్ హౌస్ 32 అంగుళాల హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ టీవీ:
32 అంగుళాలు కలిగిన ఈ వెస్టింగ్ హౌస్ టీవీ అమెజాన్ లో రూ.6,999 కే కొనుగోలు చేయవచ్చు. 350 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన ఎల్ఈడి స్క్రీన్, 2HDMI, 2 USB. పోర్ట్స్ తో పాటూ 20 W సౌండ్ అవుట్ ఫుట్ తో రెండు స్పీకర్లు, డిజిటల్ నాయిస్ ఫిల్టర్, ఆటోమేటిక్ వాల్యూమ్ లెవెల్ వంటి ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

 

వెస్టింగ్ హౌస్ 40 అంగుళాల ఫుల్ హెచ్డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ:
ఈటీవీ అమెజాన్ లో రూ. 13,999కి లభిస్తోంది. ఆండ్రాయిడ్ 9 OS తో పనిచేస్తుంది. ఈ రెండు డివైస్ లు HDR, 400 నిట్స్ బ్రైట్ నెస్, 2స్పీకర్లు, 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది.

Advertisement