Amazon : ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్లో మళ్లీ గ్రేట్ ఇండియా ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మొదలైంది. ఇక ఈ సేల్ ప్రైమ్ మెంబర్స్ కి ముందుగానే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో ఒక స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్ మరొకసారి ఆఫర్ తీసుకురావడంతో వినియోగదారుల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనుంది . ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకి ఈ సేల్ ప్రారంభం కానున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ పొందడమే కాకుండా ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఇక తాజాగా.. iQOO నియో 6 లాంచ్ అయ్యి పాపులర్ పొందిన విషయం తెలిసిందే . ఇక ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తో 4 AMOLED డిస్ప్లే తో లభిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో 4700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ అభిమానుల కోసం ప్రత్యేక ఫీచర్స్ కూడా ఇందులో పొందుపరిచారు. కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.. ఒకటి 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ బేరియంట్ ధర రూ.29,999 కాగా..12GB ర్యామ్+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. అయితే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో మీరు బ్యాంక్ ఆఫర్, అమెజాన్ కూపన్ ఆఫర్ తో ఏకంగా రూ.4,000 తగ్గింపు పొందవచ్చు.
అంతేకాదు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే 3,000 రూపాయల వరకు అదనంగా తక్కువకు లభిస్తుంది. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ముగిసే వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ పై 7 వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక 6.62 అంగుళాల ఫుల్ హెచ్డి తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో పనిచేస్తుంది.