ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో కస్టమర్ల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సేల్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ అందించడానికి సిద్ధమయ్యింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ కూడా ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలోనే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించడం గమనార్హం. ఇక దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు వస్తున్న నేపథ్యంలో ఇలా ఫ్లిప్కార్ట్ తో పాటు అమెజాన్ కూడా ప్రతిష్టాత్మకంగా షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామంటూ ప్రకటించడం అందరికీ హర్షదాయకం. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే తేదీలను మాత్రం ప్రకటించలేదు.
ఇక సెప్టెంబర్ 25 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ కూడా అదే సమయంలో జరగబోతున్నాయి.. ఇకపోతే సేల్ జరిగే తేదీలను ప్రకటించకపోయినా.. ఆఫర్స్ మాత్రం ప్రకటించాయి. ఈ రెండు ఈ కామర్స్ సంస్థలు. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలైన యాపిల్, షావోమీ, రెడ్మీ , రియల్ మీ, సామ్సంగ్, ఒప్పో, వివో, మోటోరోలా లాంటి పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్ పై మీరు ఏకంగా 40% డిస్కౌంట్ ను పొందవచ్చు. అంతేకాదు ఐఫోన్ 12 అలాగే ఐఫోన్ 13 పై కూడా ఊహించని భారీ డిస్కౌంట్ అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక అమెజాన్లో టీవీలతో పాటు హోమ్ అప్లయన్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కూడా అదిరిపోయే ఆఫర్స్ లభించబోతున్నాయి.
ఇక ఫ్యాషన్ నుంచి ఫర్నిచర్ వరకు ఏ వస్తువు మీరు కొనుగోలు చేయాలనుకున్నా స్పెషల్ ఫ్రైస్ కి సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లకు అదనంగా డిస్కౌంట్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకున్న అమెజాన్.. ఎస్బిఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లావాదేవీలు జరిపితే 10% అదనంగా డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా అమెజాన్లో 60 కి పైగా కొత్త ప్రోడక్ట్లు లాంచ్ అవుతున్న నేపథ్యంలో భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇందులో ఒక్క రూపాయికి ప్రీ బుకింగ్ , బ్లాక్ బస్టర్ డీల్స్, క్రేజీ ఆఫర్స్ పేరుతో మరిన్ని ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి.