Amazon Drones : అమెజాన్ డ్రోన్ డెలివరీ సేవలు.. ఎప్పుడు.. ఎక్కడ.. నుంచంటే..?

Amazon Drones : రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనిషికి శ్రమ ఉండకూడదన్న నేపథ్యంలో సరికొత్త వినూత్న ప్రయోగాలు కూడా చేపడుతున్నారు. ఇకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ- కామర్స్ సంస్థల ద్వారా మనం ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ఆ వస్తువు మనకు చేరడానికి కనీసం మూడు నుండి నాలుగు రోజుల సమయం పడుతుంది.. పట్టణ ప్రాంతాల్లో ఒక రోజు సమయం పట్టినప్పటికీ మారుమూల ప్రాంతాలకు చేరడానికి ఈ సమయం కాస్త ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఎవరైనా అత్యవసరంగా ఏదైనా కొనుగోలు చేయాలి అంటే సమయం కుదరడం లేదు. ఒక పక్క డెలివరీ బాయ్ లు కూడా అధికంగా జీతం డిమాండ్ చేయడం.. కస్టమర్లను హింసించడం.. అక్కడక్కడ మనం వింటూనే ఉన్నాం. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టడానికి అమెజాన్ వినూత్నమైన ఆలోచన చేసింది. ఇకపై తమ కస్టమర్లకు పార్సిల్ ను ఏకంగా డ్రోన్ ద్వారా డెలివరీ చేయడానికి సిద్ధమవుతోంది.

Advertisement

ఇక ఈ ఏడాది చివర్లో మొదటిసారిగా డ్రోన్ ద్వారా షాపర్లకు పార్సిల్ లను డెలివరీ చేస్తామని అమెజాన్ స్పష్టం చేయడం గమనార్హం. ఇక దీనికి సంబంధించిన ఫైనల్ రెగ్యులేటరీ కి కూడా ఆమోదం పొంది వివరాల తో పాటు మొదట ఏ నగరంలో చేపట్టబోయేది అనే విషయాన్ని కూడా వెల్లడించనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫైనల్ రెగ్యులేటరీ ఆమోదం ప్రస్తుతం పెండింగ్లో ఉంది అని కాలిఫోర్నియా , లాక్ ఫోర్డ్ లోని వినియోగదారులు తమ ఇళ్లకు వస్తువులను డెలివరీ చేయడానికి సైన్ అప్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్ కూడా తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితమే డ్రోన్ ద్వారా పార్సిల్ ను డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మొదటి సారి లాక్ ఫోర్డ్ వినియోగదారులకు డ్రోన్ ద్వారా పార్సిల్ లను డెలివరీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు..

Advertisement
Amazon drone delivery services
Amazon drone delivery services

ఆ తర్వాత ఈ సేవలను మరింత విస్తరింప చేయాలని ఆ ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ డ్రోన్ డెలివరీ ప్రాసెస్ అనేది హామీ సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తోందని ఓ బ్లాగ్ పోస్టులో అమెజాన్ తెలిపింది. అయితే ఈ సంవత్సరం తర్వాత కాలిఫోర్నియాలోని లాక్ ఫోర్డు లో నివసిస్తున్న అమెజాన్ కస్టమర్ లు ప్రైమ్ ఎయిర్ డెలివరీ లను స్వీకరించగలరు అని కూడా పేర్కొంది. ఇక ప్రైమ్ ఎయిర్ గురించి అక్కడి వినియోగదారులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ప్రతిచోట కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, సురక్షిత సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది అని వారు తెలిపారు. సుమారుగా నాలుగు వేల మంది జనాభా ఉన్న లాక్ ఫోర్డ్ లోని కస్టమర్లు బ్యాయ్ యార్డ్ లలో పార్సిల్ లను డ్రోన్ ద్వారా వదిలేలా ప్రోగ్రాం చేస్తామని కూడా అమెజాన్ స్పష్టం చేసింది. ఇకపోతే గతంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సర్వీస్ కి పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలా డెలివరీ ప్రచారాన్ని ఉపయోగించుకుంటోంది అనే ఆరోపణలు కూడా వినిపించాయి 2013లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్..

కొన్నిసంవత్సరాల లోపు డెలివరీ డ్రోన్లతో ఆకాశాన్ని నింపుతామని కూడా చెప్పారు. అదేవిధంగా 2019లో కూడా అమెజాన్ కొన్ని నెలల్లోనే కస్టమర్లకు డెలివరీ సేవలు అందించనున్నట్లు అని తెలిపారు. కానీ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ సరైన స్పష్టత ఇవ్వకపోవడం పై కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఏప్రిల్ లో న్యూస్ సైట్ బ్లూమ్ బెర్గ్ డ్రోన్ల పై భద్రతా సమస్యలను ప్రశ్నించిందట. అయినప్పటికీ అన్ని నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా సేవలు అందించే డ్రోన్లను వినియోగిస్తామని అమెజాన్ తన సమాధానంగా తెలిపింది. ఇకపోతే డ్రోన్లు గాలిలో ఎగురుతాయి అని వాటిని కంట్రోల్ చేయడానికి అబ్జర్వర్ అవసరం లేదు అని , విమానాలు, పెంపుడు జంతువులు, వ్యక్తులు వంటి అడ్డంకులను అధిగమించేందుకు సెన్సార్లను కూడా ఉపయోగిస్తామని అమెజాన్ తెలిపింది. ఇక తమ కస్టమర్లకు ఒక గంటలోపు సురక్షితంగా ప్యాకేజీలను అందజేయడమే లక్ష్యమని అమెజాన్ తెలపడం గమనార్హం. కనీసం ఇప్పటికైనా డ్రోన్ ద్వారా పార్సెల్ సర్వీస్ అమెజాన్ అందిస్తుందో లేదో తెలియాల్సి ఉంది

Advertisement