BSNL : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అయినటువంటి ప్రభుత్వ టెలికాం సంస్థ.. ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు తక్కువ ధరకు ఎక్కువ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించడానికి మరొకసారి మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకురావడం జరిగింది. ఇక సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే ఎక్కువ ఆఫర్లను అందిస్తూ మరొకసారి కస్టమర్లను ఆకర్షించడానికి సిద్ధమయ్యింది. ఇక కస్టమర్లకు మొత్తం 75 జిబి డేటా పొందడంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అంతేకాదు పది నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది .మొత్తం ఈ కొత్త ప్లాన్ తో మీరు 300 రోజుల వరకు వ్యాలిడిటీ పొందే అవకాశం ఉంటుంది.
మరి బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రీపెయిడ్ దీర్ఘకాలిక ప్లాన్ ధర రూ.2,022.. ఇక ఈ ప్లాన్ ద్వారా మీకు నెలకు 75GB డేటా లభిస్తుంది. అయితే డేటా కేవలం 2 నెలలు మాత్రమే ప్రతి నెల 75జీబీ డేటా పొందవచ్చు. ఇక ఆ తర్వాత యూజర్లు తమ డేటా ఓచర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది ప్రస్తుతం ఉన్న డేటాను పూర్తి చేసిన తర్వాత ప్రతిరోజు డేటా స్పీడు 40 కేబీపీఎస్ కి తగ్గుతుంది. ఇక బిఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్వర్క్ కి అయినా సరే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు 300 రోజుల పాటు మీరు ఉచితంగా 100 ఎస్ఎంఎస్లను పొందుతారు.
ప్రస్తుతం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి మోడీజీ ప్రవేశపెట్టిన ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ 2022 సంవత్సరంలో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం డేటా లిమిట్ టైం ఆఫర్ మాత్రమే ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు బిఎస్ఎన్ఎల్ రూ.228 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందించింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ తో పాటు ప్రతిరోజు 2GB డేటా పొందవచ్చు. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక మరొక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.239 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ తో పాటు కష్టమర్స్ కు రోజుకు 2gb డేటా.. 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. మరి బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ బాగా ప్రావీణ్యం పొందినవి కావడం గమనార్హం.