Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పుష్ప2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక పార్ట్ 2 తో పాన్ ఇండియా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు బన్నీ.. పుష్ప 2 సినిమా కంప్లీట్ కాకముందే బన్నీ మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. బన్నీ ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో బన్నీ చేరబోతున్నట్లు సమాచారం.

ఇటీవల లోకేష్ కనకరాజ్ తో అల్లు అర్జున్ సమావేశమైనట్లు సమాచారం. అయితే వీళ్ళ మీటింగ్ అల్లు అర్జున్ కొత్త సినిమా కోసమే అని అంటున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఇదే నిజమని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఖైదీ 2 ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ సినిమా మన బన్నీ తో తీస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ విక్రమ్ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో సినిమా తీస్తున్నాడు అని తెలిసి మహేష్ ఫ్యాన్స్ కు నిద్ర పట్టడం లేదట. ఎందుకంటే ముందుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మహేష్ సినిమా తీయాలనుకున్నారు కాబట్టి.. ఇంతలోనే బన్నీ కర్చీఫ్ వేసి ఆ ఛాన్స్ ను ఫిల్ చేశాడు.