Airtel Plans : ప్రస్తుతం దేశంలో దిగ్గజ నెట్వర్క్ సంస్థలైన ఎయిర్టెల్ తమ కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతిరోజు 2GB డేటా కావాలని కోరుకునే వారికి సరసమైన ధరలకే రీచార్జ్ ప్లాన్ లను అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా ఎయిర్టెల్ అందిస్తున్న డైలీ 2GB డేటా ప్లాన్ ల గురించి ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. రూ.296 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ : అపరిమిత వాయిస్ కాలింగ్ తో 30 రోజులపాటు లభించే ఈ ప్లాన్ ద్వారా మీరు మొత్తం 25 జిబి ఫోర్ జి హై స్పీడ్ డేటా పొందవచ్చు. మీకు కావాలంటే ఒకే రోజులో డేటాను పూర్తి చేసుకోవచ్చు. ఏడాది పాటు డేటా పొందాలనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ప్రతిరోజు 2GB డేటా తో పాటు మరెన్నో సదుపాయాలను కూడా పొందవచ్చు.
రూ.2999 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ తో మీకు ఎన్నో మంచి బెనిఫిట్ లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే వినియోగదారులు సంవత్సరం అంతా ఉచితంగా వాయిస్ కాలింగ్ ను పొందవచ్చు . అంతేకాదు సంవత్సరం పొడుగునా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఇక డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాబట్టి ప్రతిరోజు 2GB డేటా చొప్పున.. 730 GB డేటాను మీరు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ డైలీ డేటా లిమిట్ అయిపోయిన వెంటనే 64 కేబిపిఎస్ స్పీడుతో డేటాను ఉపయోగించుకోవచ్చు.అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా మీరు కేవలం 2GB మాత్రమే రోజుకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ 2GB అయిపోయిన తర్వాత కూడా ఫోర్ జి హై స్పీడ్ డేటా కావాలి అంటే కేవలం 20 రూపాయల లోపు డేటా ప్లాన్ ను మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ప్లాన్ కు సంబంధించిన ఇతర విషయాలను గనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ప్రీమియం ని ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు ఉచిత హలో ట్యూన్స్ తో పాటు అపరిమిత డౌన్లోడ్ లతో వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ను ఏడాది పాటు పొందే అవకాశం ఉంటుంది. దీనితోపాటు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ రీఛార్జి ప్లాన్ చేసుకుంటే మీకు అద్భుతమైన ఆఫర్లు లభిస్తాయి అని చెప్పవచ్చు.