Airtel : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఎప్పుడూ కస్టమర్లకు చేరువలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ యూజర్లకు కీలక సమాచారాన్ని అందించింది. ఇక మరో నెల రోజుల్లో 5G సర్వీసులు ప్రారంభించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వాడుతున్న 4G SIM కార్డులు 5G ఫోన్ పై పనిచేస్తాయని, సిమ్ మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని స్పష్టం చేసింది. ఇకపోతే 4G సిమ్ పై 5G సేవలు పొందవచ్చని అందుకు అనుకూలంగా 4G సిమ్ లు రూపొందించబడ్డాయి అని కూడా వివరించింది. ఇకపోతే తాజాగా ఎయిర్టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ ..
ప్రస్తుతం యూజర్లు వాడుతున్న 4G సిమ్ లకు 5G సామర్థ్యం ఉంది. సిమ్ మార్చాల్సిన అవసరం లేకుండా 4G సిమ్ తోనే 5G నెట్వర్క్ ను ఉపయోగించుకోవచ్చు. కేవలం 5G ఫోన్ కి మారితే సరిపోతుంది అని విట్టల్ తెలిపారు. నెట్వర్క్ సర్వీస్ లో స్పీడ్ 4G కంటే 30 రెట్లు అధికంగా ఉంటుందని గోపాల్ విట్టల్ స్పష్టం చేశారు. ఇకపోతే ఎయిర్టెల్ 4G సిమ్ ని 5G సర్వీసుల్లోకి సులభంగా అప్డేట్ చేయవచ్చు. మీ దగ్గర 5G సపోర్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి 5G నెట్వర్క్ ను ఎంచుకుంటే మీరు 4G సిమ్ తోనే కలిసి నెట్వర్క్ ను ఎంజాయ్ చేయవచ్చు.
ముందుగా 5G స్మార్ట్ ఫోన్లో 4G సిమ్ వేసిన తర్వాత సెట్టింగ్ ట్యాబ్ కి వెళ్ళాలి. ఇప్పుడు 5G సపోర్ట్ ఫోన్ అయితే 4G లేదా ఎల్ టీ ఈ తో పాటు 5G ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక అందులో మీరు 5G అని ఎంచుకుంటే సరిపోతుంది. ఇక మీ ఫోన్ 5G సర్వీసులకు సిద్ధం అయినట్టే. ముఖ్యంగా వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా దశలవారీగా 5జి సర్వీసులను అందించడానికి ఎయిర్టెల్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇకపోతే 5G సర్వీసులు అందుకోనున్న తొలి మెట్రో నగరాల జాబితాలో కోల్కతా, ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలు ఉండే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ కల్లా దేశవ్యాప్తంగా 5G సేవలు విస్తరించనున్నాయి.