AgniVeer: అగ్ని వీర్ కు దరఖాస్తుల ఆహ్వానం..!

AgniVeer.. తాజాగా అగ్నివీర్ ఉద్యోగాలకు విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ దరఖాస్తులను ఆహ్వానిస్తుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. శ్రీకాకుళం , విశాఖపట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు కాకినాడ , అనకాపల్లి , కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల వాసులు ఈ దరఖాస్తులకు అర్హులు అని స్పష్టం చేశారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్ మాన్ ఉద్యోగాల కోసం పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు.

Agniveer as Param Vir: क्या अग्निवीर बन पाएंगे 'परमवीर'? अब तक इन जवानों को  मिल चुका है वीरता का 'सर्वोच्च सम्मान' - agneepath scheme will agniveer be  able to become param vir

అర్హులైన వారు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మార్చి 16 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు వివిధ కేంద్రాలను పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నియామక ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఆన్లైన్ ఆధారిత కంప్యూటర్ పరీక్ష ఉంటుందని అందులో అర్హత సాధించిన అభ్యర్థులు రెండవ దశ పరీక్షలో షార్ట్ చేసి ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు.