జగిత్యాల జిల్లాలో ఒక పెళ్లిలో వధువు చేసిన పని తల్లిదండ్రులతో పాటు బంధువులందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి పీటలపై కూర్చొని వరుడితో తాళి కట్టించుకోవాల్సిన ఆమె అకస్మాత్తుగా మాయమయ్యింది. తీరా ఆమె అక్క భర్తతో వెళ్లిపోయిందని తెలిసింది. దాంతో నివ్వెరపోవడం అందరివంతయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నాపూర్ కి చెందిన యువతిని, లంబాడీ పెళ్లికి చెందిన అబ్బాయితో వివాహాన్ని నిశ్చయించారు. ముహూర్తం ప్రకారం వీరిద్దరూ ఆదివారం నాడు పెళ్లి వేడుకలో ఒకటి కావాల్సి ఉంది.
అయితే కాసేపట్లో పెళ్లి ఉందనగా పెళ్లి కూతురు అక్కడినుంచి ఎస్కేప్ అయ్యింది. మొదట ఏమీ అర్థం కాని తల్లిదండ్రులు చివరగా ఆమె తన అక్క భర్త అంటే బావతో వెళ్లిపోయిందని గ్రహించారు. ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా అవాక్కవుతున్నారు.