Shesh Supriya: కొన్నాళ్లుగా అడవి శేష్ పేరు వినిపించగానే తన పక్కన సుప్రియ పేరు వినిపించడం కామన్ అయిపోయింది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు.. ఏమీ లేకుండానే వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వవు కదా బాస్ అని మరికొందరు అంటున్నారు. తాజాగా వీటన్నింటికి చెక్ పెట్టాడు అడవి శేష్..
అడివి శేష్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ న్యూస్‌తో నెట్టింట వైరల్ అవుతున్న క్రమంలోనే ఒక్క ఫోటో తో చాలా మందికి చాలా ప్రశ్నలు పుట్టేలా చేశారు. నాగార్జున మేనకోడలు సుప్రియతో రిలేషన్లో ఉన్నారన్న వార్తలను క్రిస్మస్ సందర్భంగా సుప్రియ ఆమె బ్రదర్‌తో దిగిన ఫోటో తో ఆల్మోస్ట్ నిజం చేసేశారు శేష్. తమపై వస్తున్న రిలేషన్, డేటింగ్ న్యూస్ పై అందరూ కన్ఫూజ్ అయ్యేలా క్లారిటీ ఇచ్చాడు శేష్. సింగిల్ లైన్ లో కాంప్లికేటెడ్… ఫర్ ఇయర్స్ అని ఓ ఫ్యాన్స్ అడిగిన గూగుల్ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. దాంతో ఈ సింగిల్ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..