మహేష్ బాబు ఇంటికి వెళ్లిన నటి కృతిశెట్టి అండ్ ఫ్యామిలీ.. దానికోసమేనా?

హీరోయిన్ కృతి శెట్టి గురించి అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన కృతి శెట్టి పలు యాడ్స్ లో కూడా నటించింది. తద్వారా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. బేసిగ్గా కన్నడ పరిశ్రమకు చెందిన కృతి తెలుగునాట పాగా వేయడం ఒకింత ఆశ్చర్యకరమే. తొలి సినిమా ఉప్పెనతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం ఈ ముద్దుగుమ్మ. డెబ్యూ మూవీతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

ఈ క్రమంలో బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఈ క్రమంలోని చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ తో కలిసి ది వారియర్ చిత్రంలో నటించినది. అయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత హీరో నితిన్ తో చేసిన మాచర్ల నియోజకవర్గం అనే సినిమా కూడా డిజాస్టర్ గా మిగలడంతో ఆమె కధల ఎంపిక విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోంది.

ఇకపోతే మన అందాల కృతి శెట్టికి హీరో మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్ల క్రితం కృతి ట్వీట్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ నటన అంటే తనకెంతో ఇష్టమని, తన ఫాలోవర్స్ మహేష్ బాబు కోసం అడగగా ఆయన రీల్ లైఫ్ లోను అలాగే రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అని ఆకాశానికెత్తేసింది కృతి. అంతే కాకుండా మహేష్ ఒక ఇన్స్పైరింగ్ సూపర్ స్టార్ అంటూ తెలిపింది.

అలా కామెంట్ చేసిన కృతి శెట్టి తాజాగా కుటుంబసమేతంగా సూపర్ స్టార్ మహేష్ ఇంటికి వెళ్లడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అవును, ఆమె తాజాగా తన తల్లి, తండ్రితో కలిసి మహేష్ ఇంటికి వెళ్లారు. అక్కడ మహేష్ భార్య నమ్రత ఎంతో వినమ్రంగా వారిని రిసీవ్ చేసుకొని విందు ఏర్పాటు చేసారని అమ్మడు చెప్పుకొచ్చింది. ఇదే విషయం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఎందుకు వెళ్లారని విషయం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కాగా మహేష్ నెక్స్ట్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి.