Marriage Twist : కొడుకు వయసున్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న టీచర్.. ఫస్ట్ నైట్ అవ్వగానే అసలు విషయం బయటపడింది..

Marriage Twist ట్యూషన్ క్లాసులు చెప్పే ఓ టీచర్ 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకుంది.. తన దగ్గర ట్యూషన్ కి వచ్చి ఓ బాలుడికి మాయ మాటలు చెప్పి తన మెడలో తాళి కట్టించుకుంది. ట్యూషన్ పేరుతో ఆ బాలుడిని ఒక వారం రోజులపాటు తనతోనే ఉండేలాగా తన కుటుంబ సభ్యులను ఒప్పించింది. వాళ్లు కూడా చదువుకోసమే కదా అనుకొని ఒప్పుకున్నారు.. సంచలనం సృష్టించిన ఈ ఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Advertisement

పంజాబ్ లో ఈ ఘటన జరిగింది. అసలు బాలుడిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఆ టీచర్ ని ప్రశ్నించగా.. ఊహించని సమాధానాలు చెప్పింది. ఇక ఈ బాలుడిని ఏడు రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పలు జాగ్రత్తలు తీసుకుంది. ఇక సాధారణ పెళ్లికి మాదిరిగానే పెళ్లికూతురుని చేయడం, మెహందీ ఫంక్షన్, హాల్ది ఫంక్షన్ అంటూ రకరకాల ఈవెంట్స్ నిర్వహించుకుంది. పెళ్లి తర్వాత ఆ బాలుడితో కలిసి మొదటి రాత్రి కూడా నిద్రించింది. ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.

అయితే యువతికి జాతకరీత్యా మాంగల్య దోషం ఉందట. ఆ దోషం కారణంగా ఆమె పెళ్లి వాయిదా పడుతుందట. ఒకవేళ పెళ్లి సంబంధం కుదిరినా పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత తన భర్త మరణిస్తాడట. ఆమె మాంగల్య దోషం నివారణ కోసం ఓ మైనర్ బాలుడిని చేసుకోమని ఓ పూజారి చెప్పారట. ఆ సలహా మేరకు తన తల్లిదండ్రులు సహకారంతో ఆ బాలుడిని పెళ్లి చేసుకుంది ఆ టీచర్. వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్లిపోయిన ఆ బాలుడు టీచర్ ఇంట్లో జరిగిన అన్ని విషయాలను పూసగుచ్చినట్లు తన తల్లిదండ్రులకు చెప్పేశాడు.. అతని మాటలు విని ఆందోళనకు గురైన బాలుడి పేరెంట్స్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ టీచర్ ను విచారించారు.

విచారణలో ఆమె తన మాంగల్య దోషం చేసిన తతంగం మొత్తం పోలీసులకు చెప్పింది. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ మొదటి రాత్రి నిర్వహించిన మరుసటి రోజు.. ఆమె తల్లిదండ్రులు ఆమె గాజులు, పుస్తెలు, మెట్టెలు అన్నీ తీసేశారు. సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన మహిళకు ఏవైతే తంతులు నిర్వహిస్తారో అవన్నీ చేశారు. ఆమె దగ్గర బంధువులందరూ కలిసి సంతాప కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. విచారణలో ఈ వివరాలన్నీ తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు.

అభం శుభం తెలియని తమ పిల్లాడి చేత క్షుద్ర పూజలు చేయించారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. బలవంతంగా ఈ కార్యక్రమాలన్నీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి ప్రాణాలకు ఏదైనా జరిగితే దిక్కేంటని ప్రశ్నించారు. అయితే బాలుడి తల్లిదండ్రులతో ఆ టీచర్ మాట్లాడిన తర్వాత మేటర్ మొత్తం సెటిల్ అయింది. వాళ్లు తమ ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్నారు. ఇరు కుటుంబాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నారని పోలీసులు తెలిపారు. దాంతో అప్పటికే ఈ వార్త దావణంలా స్ప్రెడ్ అయింది. దాంతో ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. బాధితుడు మైనర్ బాలుడు కావడంతో.. విచారణ జరిపిస్తున్నామని జలంధర్ డీజీ గురువింద్ సింగ్ చెప్పారు.

Advertisement