Infinix Hot 10 : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి ఇన్ఫినిక్స్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ బడ్జెట్ లోనే వాటిని కష్టమర్లకు అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న ఇన్ఫినిక్స్ Hot 10 స్మార్ట్ మొబైల్ ను విడుదల చేసి బడ్జెట్ ధరలోని ఆ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి ఉంచింది. ఇప్పుడు మరొక ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా పేరుతో లాంచ్ చేస్తున్న ఈ 5G స్మార్ట్ ఫోన్లో అధునాతన ఫీచర్లను అలాగే మరింత అద్భుతమైన కెమెరా ని కూడా అమర్చినట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలైన కొంచెం సమాచారం గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ సమాచారం కొద్దిగా లీక్ అవడంతో ఆ లీకైన సమాచారం ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచెస్ డిస్ప్లే తో రాబోతోంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుందని కూడా సమాచారం. ఇక ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో పనిచేయబోతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు. ఏకంగా 200 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను ఇందులో అందించబోతున్నట్లు సమాచారం. అయితే ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఎలాంటి సమాచారం అందివ్వలేదు. ఇక అలాగే ఈ స్మార్ట్ ఫోన్లో 180 W థండర్ చార్జ్ టెక్నాలజీని కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 4700 Mah బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది. ఇక అంతే కాదు మీడియా టెక్ డైమన్ సిటీ 920 ప్రాసెసర్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. కొంచెం మిడ్ రేంజ్ లో ఉంటుందని సమాచారం. మరి ఈ స్మార్ట్ ఫోన్ ధర ఏ రేంజ్ లో ఉంటుంది అంటే లీకైన సమాచారం ప్రకారం రూ.25,000 నుంచీ రూ.30,000 మధ్య ఉండవచ్చు అని సమాచారం. అయితే ధర పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే. ఏది ఏమైనా ఇన్ఫినిక్స్ నుంచి రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ చూడడానికి చాలా ఆకర్షణగా కనిపిస్తుంది అని, ఇక ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని అందిస్తుందని కూడా కంపెనీ స్పష్టం చేసింది.