LIC policy : ఎవరైనా సరే అతి తక్కువ సమయంలోనే చాలా డబ్బును సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో సఫలం పొందితే అంతే అదృష్టం లేకపోతే నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.కాబట్టి ఇతర మార్గాలను ఎంచుకోకుండా లేదా పోస్ట్ ఆఫీస్ , ఎల్ఐసీ ప్రవేశపెడుతున్న పథకాలను ఎంచుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవవు.. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక పథకం వల్ల ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసిన వాళ్లు అవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పబోయే స్కీమ్ గురించి అన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
ప్రస్తుతం ఎల్ఐసి ఆఫర్ చేస్తున్న కన్యాదానం పాలసీ లో డబ్బులు పెట్టుబడులు పెడితే చాలు ఆడ పిల్లల పెళ్ళి విషయంలో, చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగవు. అయితే ఇందులో మీరు చేయవలసిందల్లా కేవలం ప్రతిరోజు 130 రూపాయలు, నెలకు 3,900 రూపాయలు పొదుపు చేయడం వల్ల ఒకేసారి మీరు 27 లక్షల రూపాయలను పొందచ్చు..అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క రూపాయి మీద కూడా టాక్స్ వంటివి అస్సలు ఉండవు..అంతేకాదు ఏకంగా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది..

ఈ పథకం వల్ల అన్ని ప్రయోజనాలే ఉన్నాయి కాబట్టి మీరు మీ అమ్మాయికి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ పథకంలో చేరి పించవచ్చు. ఇందుకోసం అమ్మాయి యొక్క ఆధార్ కార్డు ,గుర్తింపు కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ,ఆదాయపు సర్టిఫికెట్ ,అడ్రస్ ప్రూఫ్, మొదటి ప్రీమియం చెక్ ,అమ్మాయి సిగ్నేచర్ ,బర్త్ సర్టిఫికెట్ తో కలిపి అప్లికేషన్ ఫామ్ సమర్పించాలి. ఇకపోతే 25 సంవత్సరాలకు పాలసీ తీసుకున్నట్లయితే 22 సంవత్సరాల వరకు మీరు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీ అమ్మాయికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత 27 లక్షల రూపాయలు లభిస్తాయి.