Smart Phone : ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు చెప్పబోయే ఆఫర్ చాలా అద్భుతమైనది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ వంటి పలు ప్రైవేటు బ్యాంకులో క్రెడిట్ కార్డులతో మొబైల్స్ కొనుగోలు చేసేవారికి ఏకంగా 4వేల రూపాయల క్యాష్ బ్యాక్ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ ముఖ్యంగా వివో స్మార్ట్ ఫోన్లో పైన ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. ఇక సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు త్వరపడటం మంచిది.
వివో V25 ప్రో : వివో ఈ ఆఫర్ లో వివో v25 ప్రో స్మార్ట్ ఫోన్ పై రూ.3,500 క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోన్ ను కంపెనీ తాజాగా భారత్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఆఫర్ వర్తించడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఫోన్ కలర్ మారుతున్న బ్యాక్ అండ్ మెటల్ ఫ్రేమ్ తో ప్రీమియం డిజైన్ లో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 12 ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టం 12 పై పనిచేస్తుంది 6.56 అంగుళాల ఫుల్ హెచ్డి + AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే అలాగే డైమన్సిటీ 1300 ప్రాసెసర్ తో ఉంటుంది. గరిష్టంగా 12GB ర్యామ్, 256 GB స్టోరేజ్ తో లభిస్తుంది .ఇక 66 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 4,830 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
వివో Y 75 : ఈ స్మార్ట్ ఫోన్ మే నెలలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. 8GB ర్యామ్, 128 GB స్టోరేజ్ ఫోన్ ధర రూ.20,999.. ఐసిఐసిఐ, కోటక్ మహేంద్ర, ఎస్బిఐ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు కూడా లభిస్తుంది. 6.44 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే తో, మీడియా టెక్ హీలియో G96 4G ప్రాసెసర్ తో వస్తుంది. ఇక 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా తో పాటు 44 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా కూడా ఇచ్చారు. ఇక 44 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 4,050 Mah బ్యాటరీని కలిగి ఉంటుంది.
Vivo X80 సీరీస్ : ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.