Love: ప్రేమకు కుల, మత, జాతి బేధాలు లేనట్టే వయసు బేధం కూడా లేదని నిరూపించారు పాకిస్థాన్ కి చెందిన ఈ జంట. ఓ యువకుడు తనకంటే వయసులో 12 ఏళ్ళు పెద్దదైన ఓ యువతిని ప్రేమించాడు. అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ జంట పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
పాకిస్థాన్ కి చెందిన ఫాతిమా, ఆదిల్ ఒక ప్రాంతానికి చెందిన వారు. ఫాతిమా ఆదిల్ ని ఒక రోజు మార్కెట్ నుంచి కొన్ని సామాన్లు తెచ్చిపెట్టమనగా.. అప్పుడే తనతో ప్రేమలో పడినట్లు ఆదిల్ చెప్పాడు. ఆ రోజునుంచి ప్రతి రోజు ఫాతిమా కి గులాబీ పువ్వును వాళ్ళ ఇంట్లోకి విసిరేవాడినని వివరించాడు. ఆదిల్ అదే విషయాన్ని ఫాతిమా తో చెప్పగా ఆమె ఆశ్చర్యపోయిందట. ఆదిల్ తల్లితండ్రులను ఒప్పిస్తే ఈ వివాహానికి తాను ఒప్పుకుంటానని ఫాతిమా చెప్పిందట.
దీంతో ఆదిల్ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఫాతిమాను వివాహం చేసుకున్నాడు. ఆదిల్ చాలా మంచి వ్యక్తి అని, తన ఫ్రెండ్స్ ఎంతగా హేళన చేసినా తన పై చూపించే ప్రేమలో మార్పు లేకపోవడం తో అతడిని పెళ్లి చేసుకున్నట్లు ఫాతిమా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. సమాజం గురించి తనకు పట్టింపు లేదని, తనంటే తనకు ఎంతో ఇష్టమని ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పాడు ఆ జూనియర్ ప్రేమికుడు. దీంతో వీరి ప్రేమ కహాని కాస్త వైరల్ గా మారింది.